మరి షర్మిల అండమాన్ పోవాలా ఏంటి.?

GV Harsha Kumar YS Sharmila

తన త్యాగాల ఫలితమే తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు అంటూ చెప్పుకొని తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి తన రాజకీయ భవిష్యత్తును కాంగ్రెస్ అధిష్టానం చేతులలో పెట్టి వారి నిర్ణయమే నా శిరోధార్యం అని నమ్మిన వైస్ షర్మిల పై కాంగ్రెస్ సీనియర్ లీడర్ హర్ష కుమార్ తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారు.

ADVERTISEMENT

ఏపీ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలిగా వైస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో రీఎంట్రీ ఇస్తున్నారనే సమాచారంతో హర్ష కుమార్ తన అభిప్రాయాన్ని కాంగ్రెస్ అధిష్టానానికి తెలియచేసారు. తెలంగాణ కోడలుగా తెలంగాణలో రాజన్న రాజ్య స్థాపనకు కృషి చేస్తా అంటూ చెప్పిన తెలంగాణ బిడ్డకు ఏపీ బాధ్యతలు అప్పగించడం పై హర్ష కుమార్ అభ్యంతరాలు తెలిపారు.

కాంగ్రెస్ అధిష్టానానికి షర్మిల పై అంత నమ్మకం ఉంటే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవి కానీ, మరో రాష్ట్రము నుండి పార్లమెంట్ సీటు, లేదా రాజ్యసభ ఇవ్వచ్చు కానీ ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు మాత్రం అప్పగించవద్దన్నారు. తెలంగాణ ఎన్నికలలో తన పార్టీని ఎన్నికల పోటీ నుంచి తప్పించి కాంగ్రెస్ గెలుపు కోసం షర్మిల చేసిన త్యాగానికి ప్రతిఫలంగా టి. కాంగ్రెస్ లో కీలక పదవి దక్కించుకోవాలని ఆశ పడిన షర్మిలకు అక్కడి కాంగ్రెస్ నేతలు చెక్ పెట్టడంతో ఏపీ వైపు మనసు మళ్లించుకున్నారు షర్మిల.

ఇక ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ లోకూడా షర్మిలకు నో ఎంట్రీ బోర్డు పెడితే ఇక ఆమె ఎక్కడికి వెళ్ళాలి.? ఎదో యాదృచ్చికంగా చెప్పినట్లు షర్మిల కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే అండమాన్ అయినా వెళ్లి పనిచేస్తా అన్నట్లు ఇప్పుడు ఇటు పుట్టింటికి రావద్దంటూ, అత్తంటిలో ఉండోద్దంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు షర్మిలకు అడ్డుపడుతుంటే ఎలా..?నిజంగానే షర్మిలను అండమాన్ పంపించాలని ఆశపడుతున్నారా రెండు రాష్ట్రాల కాంగ్రెస్ సీనియర్లు అన్న సందేహం కలుగుతుంది.

ADVERTISEMENT
Latest Stories