హెచ్ 1బీ వీసాలకు కోటి రూపాయలు.. ఖర్చు అవసరమా?

H1-B Visa Shock: US Jobs Dream Gets Costlier for Indians

హైదరాబాద్‌కు చెందిన సాయి ప్రదీప్ టెక్సాస్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి, గత నాలుగు నెలలుగా అమెరికాలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. కానీ తన అర్హతకు తగిన ఉద్యోగం లభించకపోవడంతో తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనయ్యి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఏదో విధంగా అమెరికాలో అడుగు పెడితే చాలు. భారీ వేతనాలతో మంచి ఉద్యోగంతో జీవితంలో సెటిల్ అయిపోవచ్చనుకునే భారతీయ యువతకు ఈ విషాద ఘటన వాస్తవ పరిస్థితిని తెలియజేస్తుంది.

ADVERTISEMENT

అమెరికాలో ఇలాంటి ఉద్యోగ పరిస్థితి నెలకొని ఉన్నప్పుడు, ట్రంప్‌ ప్రభుత్వం మళ్ళీ హెచ్ 1బీ వీసాలపై ఏకంగా 1,03,265 డాలర్లు (సుమారు రూ.98.87 లక్షలు) ఫీజు వసూలు చేయాలని నిర్ణయించింది. కొత్తగా వీసాలు దరఖాస్తు చేసుకునేవారికి దీనిని వర్తింపజేయబోతున్నట్లు ప్రకటించారు.

హెచ్ 1బీ వీసాలకు అత్యధికంగా దరఖాస్తు చేసుకునే వారిలో భారతీయ యువతే ముందుంటుంది. ఈ వీసా కోసమే దాదాపు కోటి రూపాయలు ఫీజు చెల్లించాల్సివస్తే ప్రయాణ, వసతి ఇతర ఖర్చులు మరో 25 లక్షలు అవసరం. ఒకవేళ అమెరికాలో చదువుకోవాలనుకుంటే మరో కోటి రూపాయలు అనుకుంటే, కనీసం రెండున్నర కోట్లు ఉంటే తప్ప ఇక అమెరికాలో కాలు పెట్టలేని పరిస్థితి కనిపిస్తోంది.

ఇంత వ్యయప్రయాసల కోర్చి వీసాలు సాధించి, సాయి ప్రదీప్‌లా మాస్టర్స్ పూర్తి చేసినా ఉద్యోగాలకు గ్యారెంటీ ఉండదని స్పష్టమవుతోంది.

భారత్‌లో ఉండగానే అమెరికాలో ఉద్యోగాలకు సెలక్ట్ అయ్యి వెళ్ళేవారికైనా ఈ వీసా చార్జీలు చాలా భారమే. పైగా ట్రంప్‌ బుర్రలో ఎప్పుడు ఏ ఆలోచన వస్తుందో తెలీదు. కనుక దినదిన గండమే. సుంకాల పెంపు, జన్మహక్కు తదితర ట్రంప్‌ ప్రతిపాదనలకి అమెరికా సుప్రీంకోర్టు అడ్డుకట్ట వేసినట్లే దీనికీ వేయవచ్చు.

కానీ భారత్‌లోనే దశాబ్దాలుగా పేరు మోసిన ఉన్నత విద్యాసంస్థలున్నాయి. వాటిలో చదువుకున్న సత్య నాదెళ్ళ, సుందర్ పిచాయ్, అరవింద్ కృష్ణ, నీల్ మోహన్, నికిలేష్ అరోరా, రాజ్ సుబ్రహ్మణ్యం వంటివారు అమెరికన్ కంపెనీలను నడిపిస్తున్నారు కదా?

అంతే కాదు… ఇప్పుడు భారత్‌లో అంతర్జాతీయ యూనివర్సిటీలు ఏర్పాటవుతున్నాయి. అనేక మల్టీ నేషన్ కంపెనీలు భారత్‌కి తరలివస్తున్నాయి కూడా.

అయినా అమెరికాలో చదువులు, ఉద్యోగాల కోసం ఇంత ఖర్చు, ఇంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఉందా?అని యువత, వారి తల్లి తండ్రులు ఆలోచిస్తే మంచిది.

ADVERTISEMENT
Latest Stories