పాలు అమ్ముకునే మల్లారెడ్డి, ఎమ్మెల్యే, (మాజీ) మంత్రి ఎలా కాగలిగారు? వందల కోట్ల విలువగల భూములు ఎలా సంపాదించగలిగారు? ఓ డజను ఇంజనీరింగ్ కాలేజీలు ఎలా స్థాపించ గలిగారు?
అన్నిసార్లు ఆదాయపన్ను శాఖ దాడులు జరిగినప్పటికీ నిశ్చింతగా నవ్వుతూ డాన్సులు ఎలా చేయగలుగుతున్నారు? అంటే సమాధానాలు చెప్పడం కష్టం.
ఆ కాలేజీలను నడిపిస్తున్న కోడలు ప్రీతి రెడ్డి కూడా మామకు తగ్గ కోడలే. అంత పని ఒత్తిడి ఉన్నా చీకూచింతా లేనట్లు ఎప్పుడూ సంతోషంగా, హుషారుగా ఉంటారు. ఆమె మంచి డాన్సర్ కూడా. కనుక సందర్భానుసారం డాన్స్ చేస్తుంటారు కూడా.
మల్లారెడ్డి రక్తంలోనే కళాపోషణ ఉంది కనుక అది అందిపుచ్చుకున్న ఆమె తరచూ తమ కాలేజీలలో సినిమా ఈవెంట్స్ నిర్వహింపచేస్తూ ఉంటారు.
తాజాగా మల్లారెడ్డి కాలేజీలో ‘ఆదర్శ కుటుంబం’ ఈవెంట్ జరిగింది. దానిలో ఆమె విద్యార్ధులను ఉద్దేశించి, “మీరందరూ ఆదర్శ కుటుంబం సినిమా చూడాలనుకుంటున్నారా? అయితే ఒక్క షరతు! మీరందరూ తప్పకుండా ఆదర్శ కుటుంబం సినిమా చూస్తామని నాకు మాట ఇవ్వాలి. ఓకేనా?” అని ప్రశ్నించగా విద్యార్థులు చాలా సంతోషంగా ‘ఓకే’ అనేశారు.
“వెరీ గుడ్! అయితే అక్టోబర్ 30న కాలేజీకి సెలవు ప్రకటిస్తున్నా,” అని ప్రీతి రెడ్డి వేదికపైనే ప్రకటించేశారు.
లక్షల రూపాయలు డొనేషన్లు, ఫీజులు కట్టి పిల్లలను కాలేజీలో చేర్పిస్తే, సినిమా ఈవెంట్స్ నిర్వహిస్తారా? విద్యార్ధులను సినిమా ప్రమోషన్స్ కోసం వాడుకుంటారా? సినిమాల కోసం కాలేజీకి సెలవు ప్రకటిస్తారా? విద్యాశాఖ నిర్వహిస్తున్న సిఎం రేవంత్ రెడ్డి తక్షణం మల్లారెడ్డి కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి,” అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
“ప్రీతీ రెడ్డికి సినిమాలలోకి వెళ్ళాలనుకుంటే తనకున్న పరిచయాలతో వెళ్ళొచ్చు కదా? సినిమా వాళ్ళతో పరిచయాలు, పరపతి పెంచుకోవడం కోసం ఇలా కాలేజీలలో సినిమా ఈవెంట్స్ నిర్వహించడం దేనికి?” అంటూ మరికొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరి సిఎం రేవంత్ రెడ్డి దృష్టికి ఈవిషయం వచ్చిందో లేదో? ఆయన ఏవిధంగా స్పందిస్తారో?
ఏపీలో కూడా కొన్ని కాలేజీల్లో అప్పుడప్పుడు సినిమా ఈవెంట్స్ నిర్వహిస్తుంటారు. వీటిపై సీఎం చంద్రబాబు నాయుడు, సినీ పరిశ్రమ నుంచి వచ్చిన డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందన ఏమిటో?
HOLIDAY DECLARED to watch #AK47!
“You want me to declare a holiday? Only if you promise me you’ll watch #AK47!
Okay, DECLARED!”
– Preethi Reddy, Vice-Chairman, Malla Reddy Vishwavidyapeeth https://t.co/U51PxrT8t3
— M9 NEWS (@M9News_) October 23, 2026





