నామినేషన్స్‌ వేయనీయడం లేదంటూనే 22వేలు వేశారుగా…

TDP and YSRCP dispute over AP election nominations

స్థానిక సంస్థల ఎన్నికలలో తమ అభ్యర్ధులను నామినేషన్స్‌ వేయకుండా టీడీపి అడ్డుకుంటోందని వైసీపీ వాదిస్తోంది. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తోంది. హైకోర్టు, సుప్రీం కోర్టులో పిటిషన్లు వేసి ఎన్నికల ప్రక్రియకు బ్రేకులు వేస్తోంది. మరోపక్క రాష్ట్రంలో పలు జిల్లాలో టీడీపీ అభ్యర్థులు, వారి అనుచరులు, పోలీసులపై దాడులు చేస్తోంది.

వీటితో వైసీపీకి కొత్తగా వచ్చే నష్టం ఏమీ లేదు. పైగా సానుభూతి కూడా లభిస్తుంది. ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోతోంది. శాంతిభద్రతలకు భంగం ఏర్పడిందనే దాని వాదనలు జాతీయ మీడియాకు కూడా ఎక్కుతున్నాయి. అంటే ఈ ఎన్నికల్లో వైసీపీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని అర్ధమవుతోంది.

ADVERTISEMENT

రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు మోగుతాయి. కనుక వైసీపీ ఉచ్చులో టీడీపి శ్రేణులు బాగానే చిక్కుకున్నట్లు కనిపిస్తూనే ఉంది. కనుక కూటమి ప్రభుత్వానికి ఏర్పడిన ఈ అప్రదిష్ట కారణంగా అది ఈ ఎన్నికల్లో గెలిచి ఓడిపోతే, వైసీపీ ఓడిపోయి గెలువబోతోందని చెప్పవచ్చు.

ఈ విషయం టీడీపీ ఇప్పటికే గ్రహించింది. కానీ వైసీపీ వ్యూహాలకు ప్రతివ్యూహాలు అమలు చేయడంలో ఇంకా అలసత్వం కనిపిస్తూనే ఉంది.

ఈ ఎన్నికలలో తమ అభ్యర్ధులను నామినేషన్స్‌ వేయకుండా టీడీపి అడ్డుకుంటోందని వైసీపీ గొంతు చించుకొని పదేపదే ఆరోపిస్తోంది. అయితే ఈ గణాంకాలు చూసినట్లయితే వాస్తవం ఏమిటో అర్థమవుతుంది.

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వివిధ పార్టీల నామినేషన్స్‌ ఈవిధంగా ఉన్నాయి.

28 జిల్లాల్లో 9,829 ఎంపీటీసీలకు దాఖలైన నామినేషన్స్‌ మొత్తం 51,902.

వీటిలో టీడీపీ: 2,013 నామినేషన్లు

వైసీపీ: 20,556 నామినేషన్లు

జనసేన: 4,609 నామినేషన్లు,

బీజేపీ: నుంచి 1150 నామినేషన్లు

28 జిల్లాల్లో 659 జడ్పీటీసీ స్థానాలకు గానూ మొత్తం 5,724 నామినేషన్లు దాఖలు అయ్యాయి

చివరి రోజున జడ్పీటీసీ స్థానాలకు 3315, ఎంపీటీసీ స్థానాలకు 25,016 నామినేషన్లు దాఖలు చేసిన పార్టీలు

వీటిలో జడ్పీటీసీ స్థానాలకు

టీడీపీ: 2,078 నామినేషన్లు

వైసీపీ: 1,815 నామినేషన్లు

జనసేన: 679 నామినేషన్లు

బీజేపీ: 255 నామినేషన్లు

మొత్తం అన్ని స్థానాలకు కలిపి వైసీపీ అభ్యర్ధులు దాఖలు చేసిన నామినేషన్లు: 22,371.

ఇంత భారీగా నామినేషన్లు దాఖలు చేసినా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, వారి సొంత మీడియా, సోషల్ మీడియా కలిసికట్టుగా తమని నామినేషన్స్‌ వేయనీయడం లేదంటూ కూటమి ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. రకరకాల కథనాలు వండి వడ్డిస్తూనే ఉన్నారు.

జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి రావడం… ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేసి మళ్ళీ మాయమైపోవడం.. ఇది ఖచ్చితంగా ‘హిట్ అండ్ రన్ థియరీ’యే కదా? ప్రెస్‌మీట్స్ పెట్టేందుకే జగన్‌ బెంగళూరు నుంచి తాడేపల్లి ప్యాలస్‌కు వస్తుంటారనే సిఎం చంద్రబాబు నాయుడు చెప్పిన మాట నిజమే కదా?

ADVERTISEMENT
Latest Stories