హన్సిక – శింబు… బ్రేకప్ స్టోరీ ఇది..!

Hansika Simbhu break Upకోలీవుడ్ హీరో శింబు తోటి హీరోయిన్లైన నయనతార, శింబు తదితరులతో సాగించిన ప్రేమాయణాలు బహిరంగ విషయాలే. మొదట నయనతారతో అనుబంధం సాగించిన శింబు, దాదాపుగా పెళ్లి వరకు ఈ కధ సాగుతుందని భావించిన నేపధ్యంలో.., చివరి నిముషంలో బ్రేకప్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఆ తర్వాత హన్సికను ప్రేమించిన శింబు, ఈ బంధాన్ని కూడా పెళ్లిపీటల వరకు తీసుకెళ్ళినంత పనిచేసాడు. అయితే ఈ బంధం కూడా నయన రూట్ లోనే సాగగా, దీనిపై శింబు తండ్రి ప్రముఖ నట, దర్శకనిర్మాత టి.రాజేందర్ స్పందించారు.

శింబును ఇష్టపడిన హన్సికకు అతను ఒకే ఒక్క మాట చెప్పాడని… తమ పెళ్లి తన అమ్మానాన్నల ఇష్టపూర్వకంగానే జరుగుతుందని స్పష్టం చేశాడని తెలిపారు. ‘మా అమ్మానాన్నల పెళ్లి జరిగిన తర్వాత అమ్మ సినిమాలకు దూరంగా ఉంది. మన పెళ్లి జరిగిన తర్వాత కూడా నీవు సినిమాలకు దూరంగా ఉండాలి’ అని శింబు చెప్పాడని, దీనికి హన్సిక అంగీకరించలేదని… దాంతో వారి అనుబంధం పెళ్లి వరకు వెళ్లలేకపోయిందని తెలిపారు. ప్రస్తుతం శింబు దైవచింతనలో ఉన్నాడని… ‘నాన్నా, ఏదైనా మీరే నిర్ణయించండి’ అని చెబుతున్నాడని అన్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories