హన్సిక వేసిన ప్లాన్ చూస్తే షాక్ తగలాల్సిందే మరి..!

Hansika, Hansika Movie Offers, Hansika Telugu Movie Offers, Hansika Motwani Movie Offers, Hansika Tollywood Movie Offers, మన తెలుగు పరిశ్రమలో ఒక్క తెలుగు హీరోయిన్లు తప్ప మిగతా అన్ని భాషల హీరోయిన్లు దర్జాగా బ్రతికేస్తున్నారు. వాళ్ళు నమ్ముకున్న పరిశ్రమలో అవకాశాలు తక్కువైతే వెంటనే తెలుగు ఇండస్ట్రీ మీదికి వాలిపోతున్నారు. ప్రస్తుతం హన్సిక అదే పని చేసింది. ‘దేశముదురు’ సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తరువాత తమిళ పరిశ్రమపై దృష్టిపెట్టి మెల్లగా అక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అప్పుడప్పుడూ తెలుగులో పవర్, దేనికైనా రెడీ వంటి సినిమాలు చేస్తూ నేనున్నానని గుర్తుచేస్తూ ఉండేది.

అప్పుడందరూ తమిళంలో అంత క్రేజ్ పెట్టుకుని తెలుగులో మీడియం, చిన్న హీరోలతో సినిమాలు చేయడమేమిటని హన్సికను విమర్శించారు. కానీ హన్సిక మాత్రం పక్క ప్లాన్ ప్రకారమే ఇదంతా చేసింది. ఆమె ముందుగానే ఊహించినట్టు టైమ్ గడిచేకొద్ది తమిళ పరిశ్రమలో అవకాశాలు తగ్గడంతో తెలుగు ఇండస్ట్రీపై దృష్టి పెట్టింది. పైగా రెమ్యునరేషన్ బాగా తగ్గించి నిర్మాతలకు సహకరిస్తోంది. తెలుగులో హీరోయిన్లు లేకపోవడం, ఉన్న ఆ నలుగురైదుగురు కాస్ట్లీగా మారడంతో నిర్మాతలు కూడా హన్సికను చూజ్ చేసుకుంటున్నారు. దీంతో హన్సిక వరుసగా మంచు విష్ణు, సంపత్ నంది – గోపీచంద్ ప్రాజెక్టుల్లో ఛాన్సులు కొట్టేసి అందరూ ముక్కున వేలేసుకునేలా చేసింది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories