ఇది వైసీపీ కంటికి కనిపించలేదా!

Harish Rao Tongue Slipసుదీర్ఘమైన ప్రసంగాలు ఇవ్వడంలో రాజకీయ నేతలు సిద్ధహస్తులు. ఈ క్రమంలో ఒకటి, రెండు చోట్ల పొరపాటున తప్పులు దొర్లడం అనేది చాలా సర్వసాధారణమైన విషయం. ఇది ఎంతటి స్థాయి నేతలకైనా ఏదొక సమయంలో ఎదురవుతూనే ఉంటుంది. ఇక ఇప్పుడిప్పుడే రాజకీయ ఓనమాలు దిద్దుకుంటున్న నారా లోకేష్ వంటి నేతలకైతే చెప్పనవసరం లేదు. అయితే పరిపక్వత కలిగిన రాజకీయ నేతలు వీటిని భూతద్దంలో పెట్టి చూడకుండా, లైట్ తీసుకుంటారు. కానీ ఎలాంటి అంశాన్ని అయినా రాజకీయ లబ్ది కోసమే వినియోగించే జగన్ మీడియా వర్గాలకు మాత్రం ఇదొక సంచలన విషయం.

ADVERTISEMENT

అందులో భాగంగానే గతంలో నారా లోకేష్ పొరపాటున ఒకటి, రెండు సార్లు తప్పులు దొర్లినపుడు, మరో వార్త లేదనే చందంగా రోజుల పాటు తదేకంగా అవే వీడియోలను ప్రసారం చేసిన విషయం బహిరంగమే. అయితే అలాంటి మీడియాకు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న హరీష్ రావు వీడియో తారసపడకపోవడం అనేది టీఆర్ఎస్ – వైసీపీల మధ్య ఉన్న అనుబంధానికి నిదర్శనంగా నిలుస్తోందంటూ రాజకీయ పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. “తెలంగాణా అభివృద్ధిని అడ్డుకునే ఏకైక పార్టీ టీఆర్ఎస్” అంటూ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒకటి గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇలాంటి కధనాలు ప్రసారం చేయకపోవడం తప్పు కాదు. ఎందుకంటే… అనర్గళంగా ప్రసంగించే సమయంలో ఖచ్చితంగా పొరపాట్లు దొర్లుతుంటాయి. గతంలో జగన్ ప్రసంగించిన సమయాలలోనూ ఇది జరిగింది. కానీ మనం చేసే సంసారం, ప్రత్యర్ధి చేస్తే వ్యభిచారం అనడం ఎవరికైనా సబబు కాదు. జగన్ మీడియా వర్గీయులు వదిలినా… ఇలాంటి వాటిని సోషల్ మీడియా జనులు అస్సలు క్షమించరనేది బహిరంగమే. అందుకే ఈ సందర్భంగా టీఆర్ఎస్ తో పాటు వైసీపీ వర్గీయులను కూడా టార్గెట్ చేసుకుంటూ ఈ వీడియో నెట్టింట హంగామా చేస్తోంది.

ADVERTISEMENT
Latest Stories