‘కృష్ణయ్యా… వస్తావయ్యా…’ అయితే హిట్ అయ్యేదన్న హరీష్!

harish shankar about ntr ramayya vastavayyaజూనియర్ ఎన్టీఆర్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో “రామయ్యా… వస్తావయ్యా…” చిత్రం బాక్సాఫీస్ వద్ద చతికిలపడిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా పేరు “రామయ్యా… వస్తావయ్యా…” కాకుండా “కృష్ణయ్యా… వస్తావయ్యా…” అని పెట్టి ఉంటే ఖచ్చితంగా హిట్ అయ్యుండేదని, తానూ తప్పు చేసానని దర్శకుడు హరీష్ శంకర్ అభిప్రాయ పడ్డారు. ఈ వ్యాఖ్యలకు వేదికగా నిలిచింది “కృష్ణాష్టమి” ఆడియో వేడుక.

రాజమహేంద్రవరంలో జరిగిన ఈ ఆడియో వేడుకలో సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడును ఆటపట్టిస్తున్న సమయంలో హరీష్ శంకర్ సరదాగా అన్న మాటలు. చోటా అందరి కంటే పెద్ద కృష్ణుడు అని దర్శకుడు వంశీ పైడిపల్లి మొదలుపెట్టిన విషయాన్ని హరీష్ కొనసాగిస్తూ… అవును నిజమే… “బృందావనం” సినిమాకు కూడా చోటానే కెమెరామెన్, ఇప్పుడు “కృష్ణాష్టమి” కూడా చోటానే… నేను కూడా నా సినిమాకు ‘కృష్ణయ్యా… వస్తావయ్యా…’ అని పెట్టి ఉంటే హిట్ అయ్యేదని అనడంతో హీరో సునీల్ తో పాటు చుట్టూప్రక్కన ఉన్న వంశీ, నిర్మాత దిల్ రాజు అందరూ చిరునవ్వులు చిందించారు.

ADVERTISEMENT

ఎంతో ఆహ్లాదకరంగా సాగిన ఈ ఆడియో వేడుకలో అనసూయ యాంకరింగ్ హైలైట్ కాగా, ప్రేక్షకులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని చిత్ర యూనిట్ ఆకాంక్షను నెరవేర్చారు. ఈ నెలాఖరులో గానీ, ఫిబ్రవరి మొదటి వారంలో గానీ “కృష్ణాష్టమి” ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ADVERTISEMENT
Latest Stories