దురహంకారంతోనే అందరూ దూరం

YSRCP-Purchur

2019 ఎన్నికలలో వైసీపికి సేవలందించిన ప్రశాంత్ కిషోర్‌ టిడిపిపై కమ్మముద్ర వేసి దెబ్బ తీయవచ్చని సూచించడంతో జగన్‌ అది పట్టుకొని అల్లుకుపోయారు. ఎంతగా అంటే అమరావతిని కమ్మవారి కోసం కమ్మవారు నిర్మించుకుంటున్నారని దుష్ప్రచారంతో కమ్మ నేతలతో ఇబ్బంది పడుతున్న రెడ్డి తదితర సామాజిక వర్గాలను ఆకర్షించి తమవైపు తిప్పుకోగలిగారు.

ADVERTISEMENT

ఏపీలో టిడిపి అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే ముందుకు సాగుతూ అందరినీ మెప్పించగలిగింది. కానీ పార్టీలో కమ్మ సామాజికవర్గానికి చెందిన కొందరు అత్యుత్సాహం ప్రదర్శించడం వలన చివరి ఏడాదిన్నర పాలనలో రాష్ట్రంలో కొన్ని వర్గాలు టిడిపికి దూరమయ్యాయి. ప్రశాంత్ కిషోర్‌ ఇచ్చిన సలహాతో వారందరినీ జగన్మోహన్‌ రెడ్డి ఆకట్టుకొని ఎన్నికలలో విజయం సాధించగలిగారు.

అయితే ఆనాడు టిడిపిలో కొందరు చేసిన తప్పులే నేడు వైసీపిలో అందరూ చేస్తూ అధికార మదంతో విర్రవీగుతుండటంతో, ఈసారి రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు కూడా వైసీపికి వ్యతిరేకంగా ఓట్లు వేసిన్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, పల్నాడు జిల్లాలోని రెడ్లలో కనీసం 40-50 శాతం మంది టిడిపి కూటమికే ఓట్లు వేసిన్నట్లు తెలుస్తోంది. గత 5 ఏళ్లుగా జగన్‌ ప్రభుత్వం సంక్షేమ పధకాల పేరుతో పేదలకు డబ్బు ముట్టజెప్పిన్నప్పటికీ ఈసారి కడప, కర్నూలు, విశాఖ, విజయనగరం జిల్లాలలో ముస్లిం ఓటర్లు వైసీపికి వ్యతిరేకంగా అంటే టిడిపి లేదా జనసేనలకు ఓట్లు వేసిన్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా కడపలో కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్ధిగా వైఎస్ షర్మిల పోటీ చేయడంతో ఆ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అన్ని శాసనసభ నియోజకవర్గాలపై తీవ్రంగా ప్రభావం పడింది. కనుక కడప జిల్లాలో మైనార్టీలు, క్రీస్టియన్లు, దళితులలో కనీసం 50-60 శాతం మంది వైసీపికి వ్యతిరేకంగా ఓట్లు వేసిన్నట్లు తెలుస్తోంది.

ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులందరూ జగన్‌ ప్రభుత్వ బాధితులే. కనుక వారిలో 90 శాతం మంది, వారి కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో సహా టిడిపి కూటమికే ఓట్లు వేసి ఉంటారని వేరే చెప్పక్కరలేదు.

సంక్షేమ పధకాలతో రాష్ట్రంలో 98 శాతం మందికి మేలు చేశామని జగన్‌ ఎన్ని గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ, వైసీపిలో పైనుంచి క్రిందివరకు దురహంకారంతో వ్యవహరించడం వలన ఈవిదంగా రాష్ట్రంలో అనేక వర్గాలను దూరం చేసుకున్నారు.

కనుక తొలిసారే భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన జగన్‌, రెండోసారి దారుణంగా ఓడిపోయే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. అదే జరిగితే, అది వారి స్వయంకృతమే తప్ప ఎవరినీ నిందించడానికి లేదు.

ADVERTISEMENT
Latest Stories