‘శ్రీలక్ష్మీ అండ్ 24 కిసెస్’లో నాది బోల్డ్ రోల్!

Hebah Patel Role in Sri Lakshmi 24 Kisses‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమా తరువాత హెబ్బా పటేల్ కి మంచి సినిమా పడలేదనే చెప్పాలి. యూత్ లో హెబ్బా పటేల్ కి మంచి క్రేజ్ వుంది. కానీ ఆ క్రేజ్ ను నిలబెట్టే సినిమాలు ఆమెకి పడటం లేదు. తాజాగా అలాంటి సినిమా పడిందని హెబ్బా పటేల్ చెబుతోంది.

గతంలో ‘మిణుగురులు’ సినిమా చేసి దర్శకుడిగా మంచి మార్కులు కొట్టేసిన అయోధ్యకుమార్, ‘శ్రీ లక్ష్మీ అండ్ 24 కిసెస్’ సినిమాను తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. గతంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన ‘తేజ సజ్జా’ ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయమవుతున్నాడు.

ADVERTISEMENT

ఈ సినిమాలో కథానాయికగా హెబ్బా పటేల్ ను ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమాలో తన పాత్ర చాలా బోల్డ్ గా ఉంటుందనీ, ‘కుమారి 21F’ మాదిరిగా ఈ సినిమా తనకి మంచి హిట్ తెచ్చిపెడుతుందని ఆమె అంటోంది. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుందని అంటున్నారు

ADVERTISEMENT
Latest Stories