అక్కినేని ‘స్టార్ డం’కు వారసత్వంగా భావిస్తున్న అఖిల్ హీరోగా రూపుదిద్దుకున్న “హలో” సినిమా మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి సినిమా విఫలం కావడంతో, రెండవ సినిమాను స్వయంగా నాగార్జున దగ్గరుండి చూసుకుంటూ తన సొంత బ్యానర్ పై నిర్మించారు. దీని ఫలితం ఏమవుతుందా అని అటు అక్కినేని అభిమానులతో పాటు అఖిల్ కూడా “రెండు కోట్ల” కళ్ళతో వేచిచూస్తున్నాడు.
అవును… ఈ సినిమాకు గానూ అఖిల్ కు ఒక్క రూపాయి కూడా పారితోషికం ఇవ్వలేదట. సొంత సినిమాకు పారితోషికం ఏంటి? అనుకుంటున్నారా? అయినా గానీ ఉంటాయిలేండి… ఆ లెక్కలు వేరులే గానీ… ‘హలో’ సినిమా చేసినందుకు గానూ ఇప్పటివరకు అఖిల్ ముట్టింది అయితే ఏమీలేదు గానీ, ధియేటర్లలోకి వచ్చి హిట్ అయితే మాత్రం ఏకంగా ఓ రెండు కోట్ల బహుమతి అక్కినేని కాంపౌండ్ లో ఉండడం తధ్యం అన్నది లేటెస్ట్ న్యూస్.
అఖిల్ కు తొలినాళ్ళ నుండి బైక్ లు, కార్లు అంటే పిచ్చ ఇష్టం కావడంతో… “హలో” హిట్ అయితే 2 కోట్ల బడ్జెట్ తో లేటెస్ట్ మోడల్ కారును బహుమతిగా ఇస్తానని నాగ్ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు కారు ఎంపిక కూడా రెడీ అయ్యి ఉందంట. అంటే “హలో” సినిమాపై వారికి ఎంతటి నమ్మకమో చెప్పకనే చెప్తోంది. అయితే ఫైనల్ గా సదరు కారును గిఫ్ట్ గా ఇవ్వాలా? వద్దా? అన్నది మాత్రం నిర్ణయించేది “ప్రేక్షక దేవుళ్ళే.”



