టీజర్ టాక్ – బాబు అదరగొట్టేసాడుగా!

Hello Teaser Talk Vikram Kumar Keeps The Hopes Alive“అఖిల్” సినిమాతో భారీ డిజాస్టర్ ను చవిచూసిన అక్కినేని అఖిల్, రెండవ సినిమా “హలో” తొలి టీజర్ ప్రేక్షకులను పలకరించింది. ‘బ్యాక్ విత్ బాంగ్’ అన్న మాదిరి ‘సూపర్ స్టంట్స్’తో అఖిల్ అదరగొట్టేసాడు అనేది, ఈ టీజర్ చూసిన వీక్షకుల ఫస్ట్ టాక్. గ్రాఫిక్స్ తో చేసిన యాక్షన్ దృశ్యాలు అయినా… ఆ ఛాయలు ఎక్కడా కనపడకుండా… అద్భుతంగా చిత్రీకరించినట్లుగా కనపడుతున్నాయి.

అలాగే అక్కినేని హీరోలకు అద్భుతమైన మ్యూజిక్ అందించే అనూప్ రూబెన్స్ మరోసారి మెస్మరైజింగ్ సంగీతాన్ని అందించినట్లుగా వినపడుతోంది. బ్యాక్ గ్రౌండ్ తో అనూప్ అదరగొట్టగా, చాలా షాట్స్ లో “మనం” సినిమా ఛాయలు, ఆ సినిమా స్టోరీ కనపడుతోంది. విక్రం కే కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్కినేని ఫ్యామిలీకి మరో “మనం” అవుతుందని అభిమానులు పూర్తిగా విశ్వసిస్తున్నారు.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories