ఇక్కడ కులాల కొట్లాట ..అక్కడ మతాల మంట..!

Narendra-Modi-Rahul-Gandhi

రాష్ట్ర రాజకీయాలు కులాల కొట్లాటల మధ్య చిక్కుకుని తన అస్తిత్వాన్ని పెంచుకుంటుంటే కేంద్ర రాజకీయాలు మతాల మాటున చలి కాచుకుంటూ ఎదుగుతున్నాయి. ఇక్కడ చూస్తే కమ్మ, కాపు, రెడ్డి అంటూ ఓటేస్తుంటే అక్కడ చూస్తే హిందూ, నాన్ హిందూ అంటూ రాజకీయం జరుగుతుంది.

ఈ రోజు జరిగిన పార్లమెంట్ సమావేశాలలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం జరుగుతున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం పై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. గొప్ప నేతలందరూ హింస గురించి మాట్లాడారు, కానీ ఇప్పుడు హిందువులని చెప్పుకునే వారు హింస, ద్వేషం, అబద్దాల గురించి ప్రసంగిస్తున్నారు అంటూ పరోక్షంగా బీజేపీ పెద్దలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ADVERTISEMENT

దీని పై అభ్యంతరం తెలుపుతూ హింసను ధర్మంతో జోడించి మాట్లాడడం సరికాదని దీనికి రాహుల్ హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసారు. అలాగే ఈ చర్చలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మధ్య మతాల యుద్ధం జరిగింది. హిందూ సమాజాన్ని హింసా వాదులతో పోల్చడం చాల సీరియస్ మేటర్ అంటూ మండిపడ్డారు మోడీ.

కేవలం మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ మాత్రమే హిందూ సమాజం అవ్వదంటూ మోడీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు రాహుల్. దేవాలయాల నిర్మాణం పేరుతో స్థానికుల భూములను బలవంతంగా లాక్కొని విమానాశ్రయాలు నిర్మించారు. సామాన్యుడిని ఇబ్బంది పెడుతూ అయోధ్య ప్రారంభానికి కార్పొరేట్ పెద్దలకు మాత్రమే ఆహ్వానాలు అందించిన ఘనత బీజేపీ కే దక్కుతుందన్నారు.

అయోధ్యలో చిరు వ్యాపారుల దుకాణాలు, భవనాలు తొలగించి బీజేపీ ప్రభుత్వం వారిని రోడ్డున పడేసిందన్నారు. మందిరం ప్రారంభ సమయంలో బాధితులను కనీసం లోపలి అనుమతించలేదు. యూపీ లో అద్భుతమైన రామమందిరం నిర్మించామని గొప్పలు చెప్పుకున్న బీజేపీ కి ఆ రాష్ట్రంలో ఎదురుబెబ్బ తగలడమే బీజేపీ హింసకు ప్రత్యక్ష నిదర్శనం అంటూ రాహుల్ లోక్ సభలో బలంగా తన గళం వినిపించారు.

అయితే మోడీ, రాహుల్…లేదా బీజేపీ, కాంగ్రెస్ జరుపుతున్నఈ చర్చలు పరిశీలిస్తే ఒకరు హిందూ సమాజాన్ని రెచ్చ గొడుతున్నారు అంటూ ఒక మతాన్ని పట్టుకుని రాజకీయ చేస్తున్నారు. మరొకరు హిందూ సమాజం అంటే బీజేపీ కాదంటూనే నాన్ హిందూ మతాల వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. మనిషి టెక్నాలజీ ప్రకారంగా ఏ స్థాయికి ఎదిగినా రాజకీయాలు మాత్రం కులాలు, మతాల చుట్టే తిరుగుతున్నాయి అనడానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనం.

మేకిన్ ఇండియా అంటూ ప్రపంచం ముందు నిలబడినా మేకిన్ పొలిటిషన్స్ అంటూ రాజకీయ సమాజం ముందు దిగజారిపోతున్నాం. మనిషి అంతరిక్షంలోకి వెళ్లినా, రోదసిలో రాకెట్లు ఎగరేసినా, సముద్రగర్భంలో వింతలు కనిపెట్టిన ఇంకా కులం చూసి మనిషిని మతం చూసి మానవత్వాన్ని నిర్దేశించే స్థాయిలోనే భారత రాజకీయాలు ఆగిపోతున్నాయా.?

ADVERTISEMENT
Latest Stories