‘బిచ్చగాడు’ను వదులుకున్న ‘మెంటల్’

Srikanth Bichagadu, Srikanth Rejects Bichagadu, Srikanth Rejects Bichagadu Story, Hero Srikanth Rejects Bichagadu Movie, Srikanth Rejects Bichagadu Mentalశ్రీకాంత్‌, అక్ష జంటగా కరణం పి.బాబ్జీ దర్శకత్వంలో రూపొందిన ‘మెంట‌ల్‌’ సినిమా ఈ నెల 12న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న నేపధ్యంలో హీరో శ్రీ‌కాంత్ తాజాగా ఇంట‌ర్వ్యూలు ఇచ్చే పనిలో ఉన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ చెప్పిన పలు ఆసక్తికర అంశాలు… తండ్రి పాత్ర లాంటిది కాకుండా ఎటువంటి మంచి పాత్ర వ‌చ్చినా తాను చేస్తాన‌ని, భ‌విష్య‌త్తులో విల‌న్ పాత్ర‌ల్లో కూడా న‌టించి స‌త్తా చూపిస్తాన‌ని, తన పాత్ర న‌చ్చితేనే సినిమాలో న‌టించ‌డానికి ఒప్పుకుంటాన‌ని పేర్కొన్నాడు.

త‌న‌కు సినిమాలు త‌ప్ప వేరే ప్రొఫెష‌న్ ఏదీ తెలియ‌ద‌ని, ‘పెళ్లి సంద‌డి’ సినిమా మంచి గుర్తింపు తెచ్చిందని పేర్కొన్న శ్రీకాంత్, తాజా చిత్రం ‘మెంటల్’ సినిమాలో చాలా స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్లు చెప్పాడు. నిజాయితీ కలిగిన పోలీసు అధికారి పాత్రలో నటించిన ‘మెంటల్’ సినిమా విడుద‌ల విషయంలో ఎన్నో క‌ష్టాలు ఎదుర్కొందని ‘మెంటల్ పోలీస్’ అంటూ టైటిల్ పెట్టడంపై కోర్టు స్టే కూడా విధించిందని గుర్తు చేశాడు.

ADVERTISEMENT

చివరకు ‘మెంటల్’ టైటిల్‌తో తాను న‌టించిన సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానున్నట్లు తెలిపిన శ్రీకాంత్, ఇటీవ‌ల విడుద‌లై మంచి విజ‌యం సాధించిన “బిచ్చగాడు” సినిమా ముందు త‌న దగ్గ‌రికే వ‌చ్చిందని, కొన్ని కార‌ణాల వ‌ల్ల దానిని వ‌దులుకోవాల్సి వ‌చ్చింద‌ని అన్నారు. బహుశా ఈ సినిమాను శ్రీకాంత్ చేసి ఉన్నట్లయితే ఫలితం ఈ రేంజ్ లో ఉండేదో గానీ, ప్రస్తుతం మాత్రం ఇప్పటికీ కొన్ని ధియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది ‘బిచ్చగాడు.’

ADVERTISEMENT
Latest Stories