నిర్మాతతో హీరోయిన్ భావన నిశ్చితార్ధం!

Heroine Bhavana Gets Engaged to Producer Naveenఫిబ్రవరి 17వ తేదీన జరిగిన అనూహ్య సంఘటనతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ఇండియాగా మారిన హీరోయిన్ భావన ఓ ఇంటికి ఇల్లాలు కాబోతోంది. అవును… భావనకు త్వరలోనే ఓ సినీ నిర్మాతతో పరిణయం జరగనుంది. దీనికి సంబంధించి గురువారం నాడు తొలి అడుగు పడింది. మలయాళ సినీ నిర్మాత నవీన్ తో భావన నిశ్చితార్ధ వేడుకలు జరిగాయి. ఈ విషయాన్ని ఇండియన్ మూవీ ఇండస్ట్రీ ట్రాకర్ రమేష్ బాలా తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.

త్వరలో పెళ్లి చేసుకోబోయే ఈ జంటకు తన శుభాకాంక్షలు చెబుతున్నానని ట్వీట్ చేస్తూ… ఇందుకు సంబంధించిన ఓ ఫొటోను పోస్ట్ చేశారు. గురువారం ఉదయం వాళ్లిద్దరి నిశ్చితార్థం చాలా సింపుల్ గా జరిగిందని, వివాహ తేదీ ఇంకా నిర్ణయించలేదని తెలిపారు. గత కొన్నాళ్ళుగా నవీన్ – భావనలు ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని అధికారికంగా గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పిన భావన, తాజాగా దానిని నిశ్చితార్ధం ద్వారా ఖరారు చేసింది.

ADVERTISEMENT

ఇదిలా ఉంటే, భావనపై లైంగిక వేధింపుల కేసులో కీలక సాక్ష్యం లభించినట్టు ఓ పోలీసు అధికారి పేర్కొన్నారు. అలాగే నాడు వాహనంలో భావనను వేధిస్తుండగా మొబైల్ లో చిత్రీకరించిన ఓ వీడియో బయట పడిందని తెలిపారు. ఈ సంఘటన వెనుక మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖుల హస్తం ఉందని వచ్చిన ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదని పేరు చెప్పడానికి నిరాకరించిన సదరు పోలీసు అధికారి పేర్కొన్నారు. అయితే, తమ దర్యాప్తుతో సంతృప్తి చెందని పక్షంలో, సీబీఐతో దర్యాప్తు చేయించుకోవచ్చని, తమకు ఎటువంటి అభ్యంతరాలు లేవని కూడా అన్నారు.

ADVERTISEMENT
Latest Stories