హీరోయిన్స్ తీసుకునేది తక్కువే – రకుల్!

Rakul Preet Singh Remunerationకథానాయకులతో పోలిస్తే .. వెండితెరపై కథానాయికలు మారిపోవడం చకచకా జరిగిపోతూ ఉంటుంది. అందువల్లనే వాళ్లు తమకి గల తక్కువ సమయంలోనే వివిధ భాషల్లో నటించడానికి ఆసక్తిని చూపుతుంటారు. ఇక పోటీ కూడా కథానాయికల మధ్యనే ఎక్కువగా ఉంటుంది. నిలదొక్కుకునే లోగానే ఆ స్థానంలోకి మరొకరు వచ్చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితులను అధిగమిస్తూనే కొంతమంది కథానాయికలు అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.

అలాంటి కథానాయికల్లో కొంతమంది .. హీరోలతో పోలిస్తే తమకి వచ్చే పారితోషికం తక్కువనే ఆవేదనను వ్యక్తం చేసిన సందర్భాలు చాలానే వున్నాయి. తాజాగా ఆ జాబితాలో రకుల్ కూడా చేరిపోయింది. దక్షిణాదిలో లేడీ సూపర్ స్టార్ అనిపించుకున్న నయనతార అందుకుంటున్న పారితోషికం కూడా 3 కోట్లకి మించకపోవడం గురించి రకుల్ ప్రస్తావించింది. హీరోయిన్ల పారితోషికం పెరగాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇక తాను అందుకుంటోన్న పారితోషికం తన శ్రమకి తగినదనే చెప్పుకొచ్చింది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories