అసెంబ్లీ రద్దును సవాల్ చేస్తూ వేసిన పిటిషన్లను కొట్టేసిన హై కోర్టు

High Court Maintains Suspense on Telangana Electoral Rollsఅసెంబ్లీ రద్దును సవాల్ చేస్తూ కాంగ్రెస్ నాయకురాలు డీకే అరుణ సహా ఇతరులు వేసిన పిటీషన్లను హైకోర్టులో ధర్మాసనం కొట్టివేసింది. రాజ్యాంగ బద్ధంగా అసెంబ్లీ రద్దు జరగలేదంటూ పిటీషనర్లు చేసిన వాదనలను తోసిపుచ్చింది. సుప్రీం కోర్టు తీర్పుకు అనుగుణంగా ఆరు నెలలలోపు ఎలక్షన్లు నిర్వహించాల్సి ఉన్నందున తాము తెలంగాణకు ఎన్నికలు నిర్వహిస్తున్నామని ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన వివరణతో కోర్టు ఏకీభవించింది.

ADVERTISEMENT

[m9ad]

ఓటర్ల జాబితాను సైతం విడుదల చేశామని, ఏమైనా అభ్యంతరాలుంటే నామినేషన్ చివరి రోజు సాయంత్రం 3 గంటల వరకు తెలియజేసే అవకాశం కల్పించడం జరిగిందని కోర్టుకు వివరించారు. దీనికి స్పందించిన హైకోర్టు ధర్మాసనం.. ఓటర్ల నమోదు ప్రక్రియను తామే పర్యవేక్షిస్తామని స్పష్టం చేసింది.

కాగా, ప్రభుత్వ రద్దుకు వ్యతిరేకంగా వేసిన పిటీషన్లను కోర్టు కొట్టివేయడంతో తెలంగాణలో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్‌కు మార్గం సుగమం అయింది. డిసెంబర్ 7వ తేదీన తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయి. అదే నెల 11న ఫలితాలు ప్రకటించబోతుంది ఎన్నికల కమిషన్.

ADVERTISEMENT
Latest Stories