ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టు మరో సారి మొట్టికాయలు

High Court of andhra Pradesh - Jaganఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టు మరో సారి మొట్టికాయలు వేసింది. ప్రభుత్వం సహాయ నిరాకరణ చేస్తుంది అంటూ రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వేసిన పిటిషన్ పై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. నిజాయితీగా పనిచేసే అధికారులను ఇబ్బందులకు గురిచేయటం మంచికాదని హైకోర్టు పేర్కొంది.

తనకు అన్యాయం జరిగిందని కోర్టుకు వెళ్లి న్యాయంగా పదవి పొందిన వ్యక్తిని…ప్రభుత్వం కావాలనే ఎస్ఈసీకి సహాయ సహకారాలందించడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎన్నికల కమిషన్ అనేది స్వతంత్ర వ్యవస్థ అని.. నిరంతరంగా పనిచేసేదని, వ్యవస్థలను కాపాడుకుంటేనే ప్రజాస్వామ్యం బతుకుతుందని, లేకపోతే కూలిపోతుందని న్యాయస్థానం పేర్కొంది.

ADVERTISEMENT

దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని కోర్టు వ్యాఖ్యానించింది. అయితే ప్రభుత్వం అటువంటిది ఏమీ లేదు అంటే, ప్రభుత్వం సహకరిస్తే ఆయన కోర్టుకు రావాల్సిన పనేముంది అని ప్రశ్నించింది. ప్రభుత్వం నుంచి ఏం కావాలనేది కమిషన్ మూడు రోజుల్లోగా ప్రభుత్వానికి తెలియచేయాలని స్పష్టం చేసింది.

కోరినవన్నీ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ అమలు చేయకపోతే అప్పుడు ఏం చేయాలనేది రాష్ట్ర హైకోర్టు నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేసింది. రమేష్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిపితే బలవంతపు ఏకగ్రీవాలకు అవకాశం ఉండదనే అధికార పక్షం ఆయనకు సహకరించడం లేదు అనే అభిప్రాయం ప్రతిపక్షాలు వెల్లడిస్తున్నాయి.

ADVERTISEMENT
Latest Stories