కేసీఆర్ సర్కార్‌కు హైకోర్ట్ మరో మొట్టికాయ!

high court order to cancel the dismantle of ias quartersతొలిసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన కేసీఆర్ పాలనా పరమైన ఇబ్బందులను ఎదుర్కొంటుందన్న విషయం హైకోర్ట్ విధిస్తున్న మొట్టికాయల రూపంలో తెలుస్తోంది. బ్యానర్ల విషయంలో, పార్లమెంటరీ కార్యదర్శుల వ్యవస్థను రద్దు చేసే అంశంలో, విద్యుత్ సంస్థల తొలగింపు సందర్భంలో హైకోర్ట్ నుండి నోటీసులు అందుకున్న తెలంగాణా సర్కార్, తాజాగా మరోసారి ధర్మాసనం నుండి అక్షింతలు వేయించుకుంది.

హైదరాబాద్ ఐఏయస్ అధికారుల క్వార్టర్ల కూల్చివేతకు కార్యరంగంలోకి దూకిన కేసీఆర్ సర్కార్‌కు హైకోర్ట్ బ్రేకులు వేసింది. తక్షణమే కూల్చివేతలను నిలిపివేయాలని ఆదేశాలు ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories