రాజకీయంలో పార్టీల మధ్య అంతర్గతంగా ఎం జరుగుతుంది.? ఎవరు త్వరలో ఏ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు అనేది లీకులు రూపంలో ముందుగానే మీడియాలో, సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంటుంది. అయితే ఆ ప్రచారాలు ఉట్టి ఉహాగానాలే అంటూ రాజకీయ నేతలు ఆ వార్తా కథనాలను కొట్టిపారేస్తుంటారు.
కానీ కట్ చేస్తే సరిగ్గా వారు కొట్టిపారేసిన వార్తలను కొన్నిరోరులకు వారే నిజం చేస్తుంటారు. అయితే తాజాగా వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తన కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు ప్రకటన సందర్భంగా వైసీపీ ఉత్తరాంధ్ర నుంచి మరో పెద్ద, కీలక, సీనియర్ నాయకుడు కూడా త్వరలోనే వైసీపీ నుంచి బయటకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు అంటూ ప్రకటించారు.
అయితే సాయిరెడ్డి ప్రకటనలు వైసీపీ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ను ఉద్దేశించి అంటూ ప్రచారం జరగడంతో మీడియా ముందుకొచ్చిన బొత్స, సాయిరెడ్డి వ్యాఖ్యలను తానూ ఖండిస్తున్నట్టు ప్రకటించి తానూ వైసీపీ నుంచి ఏ పార్టీలోకి మారడం లేదంటూ జగనే మా అధినేత అంటూ తానూ వైసీపీ నేతనే అంటూ ప్రకటించారు.
అయితే బొత్స ప్రకటన అలా ఉంటే నేడు బొత్స మేనల్లుడు చిన్న శ్రీను(మజ్జి శ్రీనివాసరావు) వైసీపీ కి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి తన రాజీనామా లేఖను వైసీపీ అధినేత వైఎస్ జగన్ పంపారు. అయితే ఈయన విజయనగరం వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా, భీమిలి సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వహిస్తుండగా ఇప్పుడు ఆ పదవులకు కూడా శీను రాజీనామా చేసారు.
అలాగే విజయనగరం ZP చైర్మన్ పదవి ని కూడా వదులుకుంటూ వైసీపీ కి రాజీనామా చేసారు శ్రీను. బొత్స మేనల్లుడిగా చిన్న శ్రీను కి విజయనగరం రాజకీయాలలో మంచి పట్టు ఏర్పడింది. ఆ జిల్లా వైసీపీ పార్టీ బాధ్యతలు తీసుకున్న శ్రీను జిల్లాలో తన సొంత బలాన్ని పెంచుకున్నారు.
అయితే త్వరలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతుండడంతో వైసీపీ కి శ్రీను రాజీనామాతో ఆ జిల్లాలో వైసీపీ రాజకీయంగా భారీ నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే వైసీపీ కి రాజీనామా చేసిన శ్రీను తానూ ఏ పార్టీలో చేరబోతున్నారన్నది ఇంకా ప్రకటించలేదు.
అయితే బొత్స గత కొద్దీ కాలంగా జనసేన తో టచ్ లో ఉన్నారని, వైసీపీ కి గుడ్ బై చెప్పి కుటుంబ సమేతంగా త్వరలో జనసేన లో జాయిన్ అవుతారంటూ ఎప్పటి నుంచో గట్టి ప్రచారం జరుగుతుంది. అయితే ఆ ప్రచారం ఇప్పుడు మరింత ఊపందుకోవడం, వైసీపీ అంతర్గత రాజకీయాలు తెలిసిన సాయిరెడ్డి లాంటి వారు ఈ వార్తలకు బలం చేకూరేలా ప్రకటనలు చేయడం,
ఇప్పుడు బొత్స మేనల్లుడు శ్రీను వైసీపీ కి గుడ్ బై చెప్పడంతో ఇక రేపోమాపో బొత్స కూడా జెండా మార్చడం ఖాయం అంటూ ప్రచారం ఊపందుకుంది. అయితే బొత్స జనసేన ఎంట్రీ కి శ్రీను ద్వారాలు తెరవనున్నారా.? బొత్స వంటి సీనియర్ నేత కూడా వైసీపీ నీ వీడైతే వైసీపీ రాజకీయంగా, మానసికంగా మరింత బలహీనం అవ్వడం తప్పదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.





