kcr-jagan-revanth-recddy-chandrababu-naidu

అదేమి విచిత్రమో కానీ ఇక్కడ జగన్‌, అక్కడ కేసీఆర్‌ ఇద్దరి పరిస్థితి ఒక్కలాగే ఉంది. ఒకేలా మాట్లాడుతున్నారు… ఒకేలా వ్యవహరిస్తున్నారు… అధికారం కోల్పోగానే నీటిలో నుంచి బయటపడ్డ చేపలా ఇద్దరూ నెల రోజులకే విలవిలలాడిపోతున్నారు.

Also Read – కేసులు, విచారణలు ఓకే.. కానీ కేసీఆర్‌, జగన్‌లని టచ్ చేయగలరా?

మేము లేని ఈ రాష్ట్రం ఏవిదంగా ఉందో చూడండి. అదే… మేము అధికారంలో ఉండి ఉంటే ఇలా ఉండేదా… అంటూ ఇద్దరూ దీర్గాలు తీస్తున్నారు.

ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఇద్దరిపై ఇంకా కేసులు పెట్టనే లేదు. అప్పుడే రాజకీయ కక్ష సాధింపులంటూ ఇద్దరూ గగ్గోలు పెడుతున్నారు.

Also Read – ఉల్ఫా బ్యాచ్ అట… జగన్‌ హర్ట్ అవరూ?

కేవలం నెలన్నర రోజులకే జగన్‌, కేసీఆర్‌ అధికారం కోసం ఇంతగా ఆరాటపడుతుంటే, ఇంత విలవిలలాడుతుంటే మరి 5 ఏళ్ళు ఏవిదంగా కాలక్షేపం చేస్తారు? అనే సందేహం కలుగకమానదు.

కేసీఆర్‌ ఢిల్లీలో బీజేపీ పెద్దలతో తెరచాటు మంతనాలు సాగిస్తున్నారని సిఎం రేవంత్‌ రెడ్డి స్వయంగా శాసనసభలో చెప్పారు. కనుక బీజేపీ సహకారంతో కేసీఆర్‌ తెలంగాణలో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టాడమో లేదా ఇబ్బంది పెట్టడమో చేసే అవకాశం ఉంది. ఆ ఆశతోనే కేసీఆర్‌ రాజకీయాలు చేస్తున్నారు.

Also Read – జమ్ము కశ్మీర్‌ దాడి: అందరి తాపత్రయం మైలేజ్ కోసమే?

కానీ జగన్‌కు ఆ ఆశ కూడా లేదు. ఢిల్లీలో రెండు రోజులు మకాం వేసి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముల అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినా దొరకలేదు. పైగా కాంగ్రెస్‌ మిత్రపక్షాలతో రాసుకుపూసుకు తిరిగారు కనుక ఇక మోడీ, అమిత్ షాల దయ తప్పిన్నట్లే.

పోనీ వైసీపికి ఎమ్మెల్యేలున్నారా అంటే జగన్‌తో కలిపి 11 మంది మాత్రమే ఉన్నారు. టిడిపి కూటమి 164 మంది ఉన్నారు. కనుక జగన్‌ భాషలోనే చెప్పుకుంటే దాని ఈక కూడా పీకలేరు.

జగన్‌ ఈరోజు తాడేపల్లి ప్యాలస్‌లో మీడియా సమావేశం పెట్టి, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయనే పాట మరోసారి పాడిన తర్వాత, ఎన్నికల హామీలు అమలుచేయకుండా తప్పించుకునేందుకే చంద్రబాబు నాయుడు పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టడం లేదని ఆరోపించారు. కనుక రాష్ట్రంలో ప్రతీ ఒక్కరూ ఆలోచించాలని కోరారు.

ఒకవేళ చంద్రబాబు నాయుడు హామీలు అమలుచేయకపోతే అందుకు ఆయనే నష్టపోతారు. కనుక వాటి గురించి ఆయన, ప్రజలే ఆలోచించుకుంటారు.

కానీ రేపు వరుసగా కేసులు మొదలయితే మళ్ళీ జైలుకి వెళ్ళాల్సి వస్తుందా?వెళ్తే ఇప్పుడు పార్టీలో షర్మిల కూడా లేరు కనుక పార్టీని ఎవరికి అప్పగించాలి? అని జగనే ఆలోచించుకోవాలి.

ఐదేళ్ళు అధికారం చలాయిస్తూ 175కి 175 గెలుచుకుంటామని అనుకున్నప్పుడే ఇంత దారుణంగా ఓడిపోతే ప్రతిపక్షంలో ఉంటూ ఐదేళ్ళ తర్వాత జరిగే ఎన్నికలలో మళ్ళీ వైసీపి గెలుస్తుందనే గ్యారెంటీ ఏమిటి?అసలు ఈ 5 ఏళ్ళు ఏవిదంగా కాలక్షేపం చేయాలి?అని జగన్, వైసీపిలో ఉంటే తమ పరిస్థితి ఏమిటని వైసీపి నేతలే ఆలోచించుకుంటే మంచిది. జగన్, కేసీఆర్‌ ఇద్దరూ ఓసారి చంద్రబాబు నాయుడు డెయిరీ తీసుకొని 5 ఏళ్ళు ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఏవిదంగా పోరాదారో తెలుసుకుంటే మంచిది.