
ఇదివరకు ఓసారి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ, “నా అన్న జగన్మోహన్ రెడ్డి నాకు ఆస్తులలో న్యాయంగా రావలసిన వాటా ఇవ్వకుండా కొసరు వేసిన్నట్లు రూ.101కోట్లు మాత్రమే ఇచ్చారని ఆరోపించారు.
Also Read – ‘పోరు’ బాటలు కాదు ‘ప్రతీకార’ చర్యలే…
వైఎస్ ఆస్తులలో కొసరే జస్ట్ రూ.101 కోట్లు ఉంటే అసలు ఎన్ని లక్షల కోట్లు ఎంటుందో ఎవరూ ఊహించలేరు. అసలు అన్ని లక్షల కోట్ల ఆస్తులు వారు ఎలా సంపాదించగలిగారు?అంటే అవన్నీ వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ‘క్విడ్ ప్రో’ ద్వారా సంపాదించినవే అని సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ చెప్పారు.
పద్మవ్యూహంగా మారిన ఆ అక్రమాస్తుల కేసులో నుంచి ఇంకా జగనే బయటకు రాలేదు కనుక మనం ప్రవేశిస్తే అసలే రాలేము.
Also Read – నేను రప్పా రప్పా తొక్కేస్తాను.. బాధ్యత చంద్రబాబుదే!
కనుక అటువైపు వెళ్ళకుండా చెల్లికి ప్రేమతో జగన్ ఇచ్చిన ‘కొసరు ఆస్తుల’ గురించి మాజీ మంత్రి పేర్ని నాని చెప్పిన జాబితాని ఓసారి చూస్తే సామాన్య ప్రజలకు కళ్ళు తిరుగుతాయి.
ముఖ్యంగా జగనన్న ప్రసాదంగా ఇచ్చిన సెంటు భూమిలో నివశిస్తున్న పేద కుటుంబాలు మూర్ఛపోతాయి. పేర్నినాని చెప్పిన లెక్కల ప్రకారం జగన్ తన చెల్లికి ఇచ్చిన ఆస్తులు ఇవే.
Also Read – బనకచర్లలో పారే నీళ్ళకంటే రాజకీయాలే ఎక్కువ?
1. బంజారాహిల్స్ రోడ్ నంబర్:2 లో 280 గజాల స్థలం.
2. ఇడుపులపాయలో 51 ఎకరాలు.
3. పులివెందులలో 7.6 ఎకరాలు.
4. విజయవాడలో రాజ్-యువరాజ్ థియేటర్లో 35శాతం వాటా.
5. విజయలక్ష్మి మినరల్స్ ట్రేడింగ్ కంపెనీలో 100 శాతం వాటా.
6. సందూర్ హైడ్రో పవర్ ప్రాజెక్టులో వాటాలు, లైసెన్సులు.
7. స్మాల్ హైడ్రో ప్రాజెక్టులలో వాటాలు, లైసెన్సులు.
8. భారతీ సిమెంట్స్ కంపెనీలో 40 శాతం వాటా.
9. సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్‌లో 100 శాతం వాటా.
వీటిలో మొదటి ఏడు ఆస్తుల పంపకాలు వారి తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవించి ఉండగానే జరిగిపోయాయని చెప్పారు.
వైఎస్ మరణించిన తర్వాత కూడా తల్లి, చెల్లిపై ప్రేమతో జగన్ తన స్వార్జితమైన భారతీ, సరస్వతి కంపెనీలలో కూడా వాటాలు ఇచ్చేందుకు అంగీకరించారని పేర్నినాని చెప్పారు. ఈడీ అటాచ్‌మెంట్‌లో ఉన్న ఆస్తులు, కంపెనీలపై కోర్టు కేసులన్నీ పూర్తయిపోయాక, వాటిలో కూడా వాటాలు ఇస్తానని జగన్ తెల్లకాగితం మీద వ్రాసి ఇచ్చారని పేర్ని నాని చెప్పారు.
కానీ వైఎస్ షర్మిల రాజకీయ దురుదేశ్యంతో జగన్ మనసు గాయపడేలా చేయడంతో ఆయన తన స్వార్జితం నుంచి వాటాలు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారని పేర్నినాని చెప్పారు. కానీ వైఎస్ షర్మిల దురాశకి అంతులేకుండా పోయిందని అందుకే నోటికి వచ్చిన్నట్లు మాట్లాడుతున్నారని పేర్నినాని ఆరోపించారు.
వైఎస్ కుటుంబంలో ఆస్తుల పంపకాల వ్యవహారంతో సిఎం చంద్రబాబు నాయుడుకి, టిడిపికి సంబంధం ఏమిటని పేర్నినాని ప్రశ్నించారు. జగన్‌ని అప్రదిష్ట పాలుజేసేందుకే ఈ వ్యవహారంలో టిడిపి వేలు పెడుతోందని పేర్నినాని ఆరోపించారు.