నోట్ల రద్దు తర్వాత కారు కొన్నారా… అయితే రెడీగా ఉండండి..!

income-tax-raids-on-bought-cars-after-november-8పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వెలువడ్డ నవంబర్ 8వ తేదీ తర్వాత కార్లు కొనుగోలు చేసిన వారికీ కూడా ఐటీ శాఖ నుండి నోటీసులు తప్పవట. నోట్ల రద్దు అనంతరం దేశ వ్యాప్తంగా పలు చోట్ల విస్తృత సోదాలు నిర్వహించిన ఐటీ శాఖ దృష్టి కార్ల అమ్మకాలపై కూడా పడింది. నవంబర్ 8 తర్వాత దేశంలో ఎన్ని కార్లు విక్రయించారనే వివరాల గురించి తెలుసుకునే పనిలో ఐటీ శాఖ అధికారులు నిమగ్నమయ్యారు.

ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఉన్న కార్ల డీలర్లకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. నవంబర్ 8 తర్వాత కార్లు కొనుగోలు చేసే వారు ఆయా తేదీలను మార్చుకుంటారనే అనుమానాన్ని కూడా సంబంధిత అధికారులు వ్యక్తం చేశారు. ఎంట్రీ పుస్తకాల్లో పాత తేదీలను కూడా తనిఖీ చేసే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే నోటీసులు అందుకున్న కార్ల డీలర్లు… అమ్మకాలకు సంబంధించిన వివరాలను ఐటీ శాఖ అధికారులకు అందజేస్తున్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories