ట్రంప్‌ వేధింపులు వ్యాపారం కోసమేనా?

India, US Sign Major 10-Year Defense Deal

భారత్‌-పాక్‌ యుద్ధాన్ని ఆపేందుకు తాను ట్రేడ్ అస్త్రం ప్రయోగించానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ అప్పుడే చెప్పారు. ఆ తర్వాత కుంటి సాకులతో భారత్‌ ఎగుమతులపై 50 శాతం పన్ను విధించారు. ఇంకా హెచ్-1బీ వీసా, ఈఏడీ వర్క్ పర్మిట్స్ పేరుతో భారత్‌ చెయ్యి మెలిపెడుతూనే ఉన్నారు. మరోపక్క డ్రాగన్ చేతిని కూడా ఇలాగే మెలిపెట్టి మెల్లగా లొంగదీసుకుంటున్నారు.

ప్రస్తుతం మలేసియాలో జరుగుతున్న ఆసియన్ రక్షణ మంత్రుల సమావేశంలో భారత్‌-అమెరికా మద్య రక్షణ ఒప్పందం జరిగింది, భారత్‌ తరపున రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, అమెరికా తరపున ఆ దేశ రక్షణ శాఖ కార్యదర్శి పీట్ హేగెత్స్ దీనిపై సంతకాలు చేశారు. ఇది పదేళ్ళ పాటు అమలులో ఉంటుంది.

ADVERTISEMENT

దీని ప్రకారం ఇరుదేశాల మద్య వ్యూహాత్మక, భద్రతకు సంబందించిన అంశాలలో పరస్పరం సహకరించుకుంటాయి. కానీ అసలు విషయం ఏమిటంటే అమెరికా నుంన్చి భారత్‌ అత్యాధునిక ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానం పొందుతుంది. దీనినే మరోలా చెప్పాలంటే అమెరికా ఆయుధాలు, టెక్నాలజీని భారత్‌ కొనుగోలు చేస్తుందన్న మాట.

అది వంద కోట్లో, వెయ్యి కోట్లో ఉండదు. రష్యా నుంచే లక్ష కోట్ల విలువగల రక్షణ ఒప్పందం చేసుకున్నప్పుడు, అమెరికా అంతకంటే కాస్త ఎక్కువే ఉంటుంది తప్ప తక్కువ ఉండదని వేరే చెప్పక్కర లేదు. దీని తర్వాత మరికొన్ని ఒప్పందాలు కూడా జరిగే అవకాశం ఉంది.

కనుక ఈ ఒప్పందాల ద్వారా భారత్‌ నుంచి ట్రంప్‌ ఆశిస్తున్నది లభిస్తే, పన్నులు తగ్గించడం కూడా ఖాయమే.

కనుక దీని కోసమే ఇంతకాలం పన్నులు, హెచ్-1బీ వీసాల పేరుతో భారత్‌ చెయ్యి మెలిపెడుతున్నారని త్వరలో స్పష్టం కాబోతోంది. కానీ ట్రంప్‌ ఒత్తిళ్ళకు తలొగ్గి, అమెరికా నుంచి ఆయుధాలు కొనుగోలు చేసినా నష్టం ఉండదు కానీ జన్యు మార్పిడి చేసిన అమెరికా ఆహార ఉత్పత్తులను భారత్‌లోకి అనుమతిస్తే, అది భారతీయ వ్యవసాయ రంగాన్ని చావు దెబ్బ తీయక మానవు.

ADVERTISEMENT
Latest Stories