ఒకపక్క ఆపరేషన్ సింధూర్ తో భారత ఆర్మీ చేతిలో చావు దెబ్బ తిన్నా పాకిస్తాన్ కు ఇంకా తత్త్వం బోధపడలేదనుకుంటా. మరోపక్క ఇటు క్రికెట్లో సైతం భారత్ చేతిలో మట్టికరిచినా పాక్ కు తన స్థాయి తెలిసిరావడం లేదనుకుంటా.
భారత ప్రభుత్వం దయతలచి సింధు జలాలు కిందకి వదిలితే తప్ప పాకిస్తాన్ లో పంటలు పండని పరిస్థితి, అక్కడి ప్రజలకు తాగు, సాగు నీరు అందని దుస్థితి. అయినా పాకిస్తాన్ భారత్ వంటి ప్రజాస్వామ్య, శాంతియుత దేశం పై నిత్యం ఏదోఒక అవాకులు చవాకులు పేలుతూ, చౌకబారు ప్రకటనలు చేస్తూ అటు పిమ్మట నవ్వులపాలవుతూనే ఉంటుంది.
తాజాగా పాక్ రక్షణ మంత్రి ఆసిన్ ఖవాజా భారత్ పై తమ స్థాయికి మించిన ప్రకటనలు చేసారు. భవిష్యత్ లో ఇరు దేశాల మధ్య సైనిక దాడి జరిగితే సొంత యుద్ధ విమానాల కిందే భారత్ సమాధి అవుతుందంటూ వ్యాఖ్యానించారు.
అయితే ఇటీవల ఆపరేషన్ సింధూర్ 2.0 జరిగితే ఈసారి భారత్ సహనం అనే కంచెను దాటుతుందని, తద్వారా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ ను ప్రపంచ పటంలో లేకుండా చేస్తామంటూ భారత ఆర్మీ చీఫ్ ద్వివేది పాక్ ను హెచ్చరించారు.
అలాగే భారత రక్షణ శాఖ మంత్రి రాజనాధ్ సింగ్ సైతం పాకిస్తాన్ ఉగ్రవాదం పై ఉక్కుపాదం అంటూ పాకిస్తాన్ ఉగ్రవాదం పై కీలక ప్రకటనలు చేసారు. దీనితో పాక్ రక్షణ మంత్రి సైతం భారత్ కు కౌంటర్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగానే ఈ దుస్సాహసానికి పాల్పడివుండొచ్చు.
అయితే నిజంగా పాక్ కు భారత్ ను సమాధి చేయగలిగే స్థాయి ఉందా.? ఉంటే నాలుగు రోజుల ఆపరేషన్ సింధూర్ తోనే పాక్, భారత్ తో కాళ్లబేరానికి వచ్చేదేనా.? అమెరికా అధ్యక్షుడితో భారత్ తో రాయబారాలు నడిపేవారేనా.? ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత ఆర్మీ పాక్ పై జరిపిన ప్రతి దాడికి విజువల్ ప్రూఫ్ చూపించింది.
కానీ పాక్ మాత్రం భారత్ పై దాడి చేసి 6 భారత ఆర్మీ జట్లను కూల్చేశాం అంటూ ఇటు పాక్ భూభాగం నుండి దుబాయ్ క్రికెట్ మైదానం వరకు అటు పాకిస్తాన్ ఆర్మీ నుంచి పాక్ మంత్రులు, పాక్ క్రికెట్ జట్టు సభ్యులు వరకు అందరు ఆరు..ఆరు అంటూ నానాహడావుడి చేసారు.
అయితే వారు చెపుతున్నట్టుగా కూల్చివేసిన ఆ ఆరు భారత జట్ల కు సంబంధించి ఒక్క సాక్ష్యం అయినా చూపించండి అంటే పాక్ వద్ద సమాధానం శూన్యం. పాకిస్తాన్ మాటలకు వారి చర్యలు మధ్య ఉండే అంతరానికి ఇదే ప్రత్యక్ష సాక్ష్యం.
అటువంటి పాక్ భారత్ వంటి అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని సమాధి చెయ్యగలుగుతుందా.? అది ఎప్పటికి పాకిస్తాన్ పగటికల గానే మిగులుతుంది. అయితే ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న ఈ ఇరు దేశాల మధ్య మళ్ళీ ఈ తరహా యుద్ధ వాతావరణం ఏర్పడడానికి తెరవెనుక జరుగుతున్న అగ్రరాజ్య రాజకీయమే కారణమా.?




