ప్రపంచ క్రికెట్ లో ఇండియన్ అద్భుతం!

INDIAN WON IN WORLD WIDE CRICKET MATCHఆడుతున్నది అండర్ 16 స్కూల్ ఈవెంట్… మొత్తం ఎదుర్కొన్న బంతులు 199… చేసిన పరుగులు 652… అందులో 78 ఫోర్లు… 30 సిక్సర్లు..! ఇదేదో ‘హ్యాపీ డేస్’ సినిమాలో బ్యాట్ కు తగలగానే ఫోర్ బౌండరీ దాటినట్లు కాదు. అనితర సాధ్యమైన ఈ రికార్డును సాధించింది… మన ముంబై స్కూల్ కుర్రాడు ప్రణవ్ ధనవాడే.

సోమవారం ముంబై క్రికెట్ సంఘం నిర్వహించిన ఇంటర్ స్కూల్ టోర్నీలో ఆర్య గురుకుల్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కేసీ గాంధీ స్కూల్ తరపున బ్యాట్స్‌మన్ గా బరిలోకి దిగిన ప్రణవ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మైనర్ క్రికెట్ లోనే కాదు, ప్రపంచస్థాయి క్రికెట్ కు సంబంధించినంత వరకు ప్రణవ్ దే అత్యధిక స్కోర్.

ADVERTISEMENT

1899లో ఏఈజే కొలిన్స్ చేసిన 628 పరుగులే ప్రపంచంలో వ్యక్తిగత బ్యాట్స్ మెన్ అత్యధిక పరుగులు. 116 సంవత్సరాల ఆ రికార్డును ఘనంగా తుడిచిపెట్టేసాడు మన ముంబై వీరుడు. భారత్ తరపున 2014లో ముంబైలోనే పథ్వీ షా నెలకొల్పిన 546 పరుగుల అత్యధిక స్కోర్ కూడా ఈ సందర్భంగా కనుమరుగయ్యింది. ఊహలకందని విధంగా సాధించిన ఈ రికార్డుతో ప్రస్తుతం జాతీయ వ్యాప్తంగా ప్రణవ్ పేరు మారుమ్రోగుతోంది.

ADVERTISEMENT
Latest Stories