ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన క్రికెట్ టోర్నీగా విరాజిల్లుతున్న ఐపీఎల్.. ఈ ఏడాది నీలినీడలు అలముకున్నాయి. ఏప్రిల్ 15 వరకూ ఈ టోర్నీ వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. ఏప్రిల్ రెండో వారంలో ఓసారి పరిస్థితిని సమీక్షించి టోర్నీ నిర్వహణపై బీసీసీఐ అంతిమ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అన్నారు.
అవసరమైతే డియంలో ప్రేక్షకుల్ని అనుమతించకుండా టోర్నీ నిర్వహించడం, అదే సమయంలో తక్కువ మ్యాచులతో టోర్నమెంట్ జరపడం వంటి ఆలోచనలు చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ టోర్నమెంట్ ని జులై… సెప్టెంబర్ సమయంలో నిర్వహిస్తే ఎలా ఉంటుందని అనే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.
ఆ సమయంలో ఇంగ్లాండ్, పాకిస్తాన్ టీంలు తప్ప మిగతా వారికి టైట్ షెడ్యూల్ లేదు. పాకిస్తాన్ ఎలాగూ ఐపీఎల్ లో ఉండదు కావున ఆ సమయంలో టోర్నమెంట్ నిర్వహిస్తే ఎలా ఉంటుందని అనే ఆలోచనలో బీసీసీఐ ఉంది. 2008 నుంచి ఏటా బీసీసీఐకి కాసుల వర్షం కురిపిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్..ఒకవేళ రద్దయితే.. బీసీసీఐ ఊహించని రీతిలో వేల కోట్ల రూపాయలు నష్టపోనుంది.
అక్షరాలా.. రూ. 3,869.5 కోట్లు నష్టపోనుందని బిజినెస్ టుడే అంచనా వేసింది. బీసీసీఐ నష్టపోనున్న రూ. 3,869.5 కోట్లలో ముప్పావు వంతు పైగా అంటే..? రూ. 3.269.5 కోట్లు బ్రాడ్‌కాస్ట్, స్ట్రీమింగ్ రెవెన్యూకాగా.. మిగిలిన రూ. 200 కోట్లు సెంట్రల్ స్పాన్సర్‌షిప్, రూ. 400 కోట్లు టైటిల్ స్పాన్సర్‌షిప్ రూపంలో దక్కనున్న డబ్బు. ఆటగాళ్లు కూడా భారీగా నష్టపోనున్నారు.





