కలిసి పోటీ చేసాం, కలిసి ఎన్నికల ప్రచారం కొనసాగించాం, పొత్తు ధర్మానికి కడ్డుబడి నాయకుల మధ్య సీట్ల బదిలీ చేసాం, అలాగే పార్టీల మధ్య ఓటు బదిలీ సాధించగలిగాం, చివరికి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాం…ఇక పొత్తు ధర్మం ముగిసినట్టే అనేలా రాష్ట్రంలో కూటమి పార్టీల పని తీరు కనపడుతుంది.
Also Read – మేమూ డైరీలు రాసుకుంటున్నామోచ్!
విజయవాడలో వరదలొస్తే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎక్కడ.? ప్రజలు కష్టాలలో ఉంటే కళ్యాణ్ కేక్ కటింగ్ లో ఉన్నారా.? అంటూ వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తుంటే దానికి టీడీపీ సైలెంట్ గా ఉంటే జనసేన బదులిచ్చింది.
అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద విపత్తు వచ్చిన నాటి నుంచి ప్రజలు సురక్షితంగా వారి సొంత ఇంటికి చేరే వరకు దాదాపు 8,9 రోజుల పాటు తాను ఇంటికి కూడా వెళ్లకుండా వరద ప్రభావిత ప్రాంతాలలో బస్సులో జీవించారు.
Also Read – కేటీఆర్, హరీష్ రావు… ఎన్నటికీ మారరా?
దానికి తోడు రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ఎమ్మెల్యే లను, మంత్రులను, పార్టీ కార్యకర్తలను వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంచారు. అయితే బాబు ఇంత చేస్తున్న జగన్ మొదలుకుని వైసీపీ నేతలందరూ ముఖ్యమంత్రి చంద్రబాబు పై అసత్య కథనాలతో, తప్పుడు ప్రచారాలతో విరుచుకుపడ్డారు.
ప్రభుత్వం vs ప్రతిపక్షం గా మొదలైన ఈ విమర్శల పర్వం ఒకానొక సందర్భంలో టీడీపీ vs వైసీపీ లా మారిపోయింది. అయితే బాబుని డిఫెండ్ చేస్తూ జగన్ తో పాటు వైసీపీ నేతలందరికీ కౌంటర్ వేయడానికి టీడీపీ నేతలు, టీడీపీ మంత్రులే మీడియా ముందుకు వచ్చారు.
Also Read – అమరావతి గురించి చింతించలేదు కాని ప్యాలస్ ముఖ్యమా?
అటు పవన్ ను మద్దతుగా టీడీపీ నేతలు కానీ ఇటు బాబు కి మద్దతుగా జనసేన నేతలు కానీ, అసలు ఈ ఇద్దరికీ అండగా బీజేపీ కానీ మీడియా ముందుకొచ్చి వైసీపీ చేస్తున్న బురద రాజకీయానికి సమాధానం చెప్పలేక పోయింది.
వైసీపీ అనేది టీడీపీ, జనసేన పార్టీలకు ఉమ్మడి శత్రువు. అయితే ఇక్కడ ఈ రెండు పార్టీల నాయకులు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే జగన్ రెచ్చిపోతుంది టీడీపీ పార్టీ అధినాయకత్వం పైన కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రిని. కూటమి పార్టీల అధినాయకుడిని. అలాగే వైసీపీ తప్పుబడుతుంది ఏపీ ఉపముఖ్యమంత్రిని, అంతేకాని జనసేన అధినేతను కాదు.
కూటమి ప్రభుత్వం మీద వైసీపీ వరద రాజకీయం చేస్తూ ముఖ్యమంత్రి బాబు పై బురద జల్లుతుంటే దాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత, ఆ విమర్శలకు కౌంటర్ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఒక్క టీడీపీ నాయకుల మీదే ఉండదు. అది జనసేన విధి, బీజేపీ కర్తవ్యం కూడా.
పొత్తు ధర్మానికి కట్టుబడి పదవులు అందుకున్న ఆయా పార్టీల నేతలు, ఎమ్మెల్యే గా గెలిచిన నాయకులు కూటమి అధినేత మీద వైసీపీ విమర్శలు ఎక్కుపెడుతుంటే మౌనం వహించడం పొత్తు ధర్మాన్ని విస్మరించినట్లే అవుతుంది.
కూటమి ప్రభుత్వంలో జరిగిన అన్ని మంచి చెడులకు పొత్తులో కలిసి పోటీ చేసిన మూడు పార్టీలకు ఎలా అయితే బాధ్యత ఉంటుందో, అలాగే ప్రభుత్వం మీద వైసీపీ చేస్తున్న విమర్శల పైన, ఆ పార్టీ నేతలు చేసే అసత్య ప్రచారాల మీద స్పందించాల్సిన బాధ్యత, ప్రత్యర్థిని నోరుమూపించాల్సిన ఆవశ్యకత అన్ని పార్టీల నాయకుల మీద ఉంటుంది.
దీనికి టీడీపీ, జనసేన, బీజేపీ ఏవి అతీతం కాదని ఇప్పటికైనా ఈ మూడు పార్టీల నాయకులు గ్రహించాలి. కలిసి పోటీ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినంత మాత్రాన పొత్తు ధర్మం అక్కడితో ముగిసినట్టు కాదు. ఈ ఐదేళ్ల పాలనా సమయంలో ఒకరి కష్టంలో ఒకరు తోడుగా నిలబడాలి.
అలాగే ఆయా పార్టీల మధ్య సమస్యలు ఏర్పడితే సామరస్యంగా పరిష్కరించుకుని మేమంతా ఒక్కటే, ఒకే కుటుంబ సభ్యులమే అన్నట్టుగా కలిసి కట్టుగా ప్రత్యర్థి పార్టీని ఢీ కొట్టాలి. అలాకాకుండా ఎవరికీ వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తే ఈ అవకాశమే ప్రత్యర్థి పార్టీకి బలంగా మారుతుంది.