విజయసాయి రెడ్డి అంతగా భయపడ్డారా?

is Vijayasai Reddy so scared that muchవైఎస్సార్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి అటు మీడియాలోనూ ఇటు సోషల్ మీడియాలోనూ ప్రత్యర్థుల మీద విరుచుకుపడుతూ ఉంటారు. చాలా సార్లు ఆయన చేసే వ్యాఖ్యలు విమర్శలపాలైనా ఆయన తన ట్వీట్ల ప్రవాహం మాత్రం మానరు. మొన్న ఆ మధ్య రఘురామ కృష్ణంరాజు ఉదంతంలో గుంటూరు మెడికల్ బోర్డు ఇచ్చిన రిపోర్టును ప్రభుత్వం ప్రభావితం చేసిందని ఏబీఎన్ ఆర్కే ఆరోపించారు.

దమ్ముంటే తన సవాలును స్వీకరించాలని ప్రభుత్వాన్ని సవాలు చేశారు. సహజంగా ఇటువంటి సందర్భంలో ఏదో ఒక కామెంట్ చెయ్యకమానరు విజయసాయి రెడ్డి. అయితే ఇప్పటిదాకా ఆయన దానిమీద స్పందించలేదు. ఆర్కే కొన్నాళ్ల క్రితం.. విజయసాయి రెడ్డి గురించి నాకు కొన్ని కలలు వచ్చాయి .. ఆ కలలని చెప్తా అని బెదిరించారు.

ADVERTISEMENT

ఆరోజు నుండి విజయసాయి రెడ్డి .. ఆర్కే గురించి నోరు తెరవడం లేదని .. మామూలుగా అయితే వారానికి ఒకసారైనా ఆర్కే గురించి ఏదో ఒక ట్వీట్ వేసే వాడని టీడీపీ వారు ఆరోపిస్తున్నారు. ఆర్కే ఛాలెంజ్ గురించి విజయసాయి రెడ్డి స్పందించాలి .. లేదంటే ఆ కలలు ఎఫెక్టే అనుకోవాల్సి వస్తది అంటూ వారు ఎద్దేవా చేస్తున్నారు.

విజయసాయి రెడ్డి అంతగా భయపడ్డారా? మరోవైపు…. ఆర్కే ఓపెన్ గా ఆ రిపోర్ట్స్ గురించి చెప్పినా .. ఇప్పటివరకు ప్రభుత్వం కానీ వైఎస్సార్ కాంగ్రెస్ కానీ అధికారులు కానీ ఎవరూ స్పందించలేదు… ఖండించలేదు. ఏవిధంగా అర్దం చేసుకోవాలి దీన్ని? ఆర్కే చెప్పింది నిజమే అనుకోవాలా? అని వారు అంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories