
ఢిల్లీ ధర్నాలో జాతీయ మీడియా ప్రతినిధి జగన్‌ని “భౌతిక దాడులతో మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ పార్టీ నేతలు భయపడుతున్నారా?” అని ప్రశ్నించగా, “నేను ఉన్నా లేకపోయినా (ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి) తేడా లేదు. రాజకీయ కక్షతో నన్ను టార్గెట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. నాపై దాడి చేసి నన్ను చంపేయాలనుకుంటే చంపేయమనండి. కానీ నాపై కక్షతో మా పార్టీ కార్యకర్తలు, అమాయకులైన ప్రజలపై దాడులు ఎందుకు చేస్తున్నారు?ఇలా చేయడం మానవత్వం కాదు.
ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. మేము అధికారంలో ఉన్న 5 ఏళ్ళలో ఎన్నడూ ఇలా ప్రవర్తించలేదు. ఏనాడూ భౌతిక దాడులకు పాల్పడలేదు. పార్టీ కార్యాలయలపై దాడులు చేయలేదు. పార్టీలకు అతీతంగా అందరికీ సంక్షేమ పధకాలు అందించాము,” అని జగన్ సమాధానం చెప్పారు.
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో అవినాష్ రెడ్డిని వెంటబెట్టుకొని జగన్ కడపలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు, “బాబాయ్ వివేకానంద రెడ్డి హత్యని చేసింది ఎవరో మీ అందరికీ తెలుసు,” అని అన్నారు.
ఓ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని పక్కన పెట్టుకొని ఈవిదంగా మాట్లాడగలిగిన జగన్, తన 5 ఏళ్ళ రాక్షస పాలన గుర్తులేన్నట్లు ఈవిదంగా మాట్లాడటం ఆశ్చర్యం కలిగించదు.
Also Read – టీటీడీ నోటీసులతో వైసీపీ గురువు ఇబ్బంది
కావాలంటే తనపై రాజకీయ కక్ష సాధించుకోవాలని చెపుతున్న జగన్, రఘురామ కృష్ణరాజు ఫిర్యాదుతో గుంటూరు పోలీసులు కేసు నమోదు చేస్తే, తనపై టిడిపి కూటమి ప్రభుత్వం అప్పుడే రాజకీయ కక్ష సాధింపులకి పాల్పడుతోందని గగ్గోలు పెట్టారు. అది కూడా గుర్తులేన్నట్లు మాట్లాడుతున్న జగన్‌ని ‘షార్ట్ మెమొరీ లాస్’ వ్యాధితో బాధపడుతున్న గజినీ అనుకోవాలేమో?
తనని టార్గెట్ చేసుకోవాలని సవాలు విసురుతున్న జగన్‌కు నిజంగా అంత ధైర్యమే ఉండి ఉంటే శాసనసభ సమావేశాలలో పాల్గొని టిడిపి సభ్యులను ఎదుర్కొని ఉండాలి కదా? కానీ శాసనసభలో అవమానాలకు భయపడే ఢిల్లీలో ధర్నా పేరుతో కాలక్షేపం చేస్తున్నారు కదా?
Also Read – అందగాడికే ఇన్ని కష్టాలు…!
‘నేను ఉన్నా లేకపోయినా రాష్ట్రానికి తేడా లేదన్న’ జగన్ మాట నూటికి నూరు శాతం నిజమే. ఒక్క ఛాన్స్ ఇస్తే 5 ఏళ్ళలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో విధ్వంసం సృష్టించి, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, వేలకోట్లు అవినీతికి పాల్పడి, సహజసంపదలను దోచేసుకొని, రాక్షస పాలనతో ప్రతిపక్షాలను కూడా భయపడేలా చేసిన జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరమా?