టీడీపీ, వైసీపీ రెండూ రాజకీయ పార్టీలే… అనేక ఒడిదుడుకులుఎదుర్కొన్నవే.. అధికారంలో, ప్రతిపక్షంలో ఉన్నవే.. కానీ వాటి రాజకీయ సిద్ధాంతాలు, వైఖరిపూర్తి భిన్నంగా ఉంటాయని అందరికీ తెలుసు.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులకేసులలో 16 నెలలు జైల్లో ఉండి వస్తే ఆ పార్టీలో అనేకమంది నేతలు వివిద కేసులలో లోపలకివెళ్ళి వస్తూనే ఉన్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులు మొదలు కాకినాడలోదళిత యువకుడిని హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేసిన అనంత బాబు వరకు అందరూ వైసీపీ గొడుగు కింద చల్లగా సేద తీరుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.
గంట, అరగంట, డర్టీ పిక్చర్, కోర్టులో ఫైల్స్, గోదాములలో రేషన్ బియ్యం దొంగతనం, ప్రభుత్వ కార్యాలయాలలో ఫైల్స్ దగ్ధం చేయడం, భూములు,పోర్టులు కబ్జాలు, క్వార్జ్ అక్రమ తవ్వకాలు, భార్య పిల్లలు ఉండగా వేరొకరి భార్యతో అక్రమసంబంధం పెట్టుకున్నవారు.. ఒకటేమిటి.. వైసీపీలో ఒక్కొక్కరికి ఒక్కో రికార్డ్ ఉంది. అందువల్ల వైసీపీకి చాలా పెద్ద చరిత్రే ఉంది. వారిని, వారి ట్రాక్ రికార్డ్స్ చూస్తున్నప్పుడు ఒకే రకమైన మైండ్ సెట్ ఉన్నవారందరూవైసీపీ గొడుగు క్రింద చేరారా? అని అనిపించక మానదు.
అలాగని ఇతర పార్టీలలో అందరూ ఆణి ముత్యాలే అని అనుకోలేము. టీడీపీలో కూడా అడపా దడపా ఇటువంటి తప్పులు, కక్కుర్తి పనులుచేసినవారు పట్టుబడుతుంటారు. సిఎం చంద్రబాబు నాయుడు వారిపై చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం వెనకాడరు.వల్లభనేని వంశీ, కొడాలి నాని వంటి అత్యంత బలమైన నాయకులను వదులుకోవడమే ఇందుకు నిదర్శనం.
ప్రతీ రాజకీయ పార్టీలో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు తప్పక ఉంటారు. కానీ నేరాలు చేసిన వారిని వెంట పెట్టుకొని తిరుగుతూ నీతులు వల్లించడం వైసీపీలో కనిపిస్తుంటే, తప్పులు చేస్తే నిర్ధాక్షిణ్యంగా వేటు వేయడం టీడీపీలో కనిపిస్తుంటుంది.
తాజాగా చేబ్రోలు కిరణ్ అనే ఓ టీడీపీ కార్యకర్త అత్యుత్సాహంతోవైసీపీ అధినేత జగన్, ఆయన సతీమణి భారతిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వెంటనే అతనిని టీడీపీ నుంచి బహిష్కరించింది.
అతను సోషల్ మీడియాలో ఓ వీడియో సందేశం ద్వారా జగన్-భారతిదంపతులకు చేతులు జోడించి “మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాను. మీ కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్నాను నన్ను క్షమించండి,” అని వేడుకున్నాడు.
అతనిని వారు క్షమించారో లేదో కానీ టీడీపీ మాత్రం క్షమించలేదు. అంతే కాదు.. దీనిపై సిఎంచంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందిస్తూ అతనిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. గుంటూరు పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. టీడీపీ, వైసీపీల మద్య తేడా ఇదే కదా?






