మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఏదో ఒక విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం, కేంద్రాన్ని వెనకేసుకురవడమే పనిగా పెట్టుకునట్టుగా ఉన్నారు. న్యాయపోరాటం ద్వారా ఎపికి ప్రత్యేక హోదా రాదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రబుత్వం ప్రజల్ని పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు.
కేంద్రంలోని అధికారులు కూడా మన వారికంటే ఎక్కువగా తెలివైన వారని, వారికి తప్పుడు లెక్కలు చూపించినా ఇట్టే పట్టేస్తారని, ఎపి సర్కారు ఆటలు సాగవని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాపై టిడిపి సర్కారుకు చిత్తశుద్ది ఉంటే ఎన్డీఏ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం ద్వారా సాధించాలని, లేదంటే రాజకీయంగా ఎదుర్కోవాలని సూచించారు.
దీనితో రాష్ట్రప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపిస్తుందని, కేంద్రం అన్నీ సక్రమంగానే ఇచ్చేసినట్టు ఐవైఆర్ కృష్ణారావు సర్టిఫికేట్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇదేమి కొత్త కాదు…. రాష్ట్రప్రభుత్వంతో ఆయన అనుకున్న పనులు కాలేదని ప్రభుత్వంపై ద్వేషం పెంచుకుని రాష్ట్రానికి వ్యతిరేకంగా పని చేస్తున్న విషయం తెలిసిందే.



