‘వెంకీ మంకీస్’ అనే పేరుతో ‘జబర్దస్త్’ ద్వారా పాపులర్ అయిన కమెడియన్ వెంకీ రోడ్డు ప్రమాదం నుండి బయటపడ్డారు. వరంగల్ నుండి హైదరాబాద్ కు వస్తున్న నేపధ్యంలో… యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని ఆలేరు మండలం సరిహద్దులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ యాక్సిడెంట్ లో వెంకీ క్షేమంగా ఉండడంతో ఊరటనిచ్చే అంశం.
స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటున్న వెంకీ, ఆలేరు మండలం సరిహద్దుకు వచ్చే పాటికి వెంకీ కారును ఆర్టీసీ బస్సు ఓవర్ టేక్ చేయగా, స్లో చేసిన వెంకీ కారును వెనుకగా వేగంగా వస్తున్న ఇన్నోవా వాహనం డీ కొట్టింది. దీంతో ఇన్నోవాలోకి ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలు కాగా, వెంకీ కారుకు మాత్రం గట్టిగానే దెబ్బలు తగిలినట్లుగా తెలుస్తోంది. దీనిపై వెంకీ ఆలేరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు.
ADVERTISEMENT
ADVERTISEMENT



