Jagan Camp Office

ఇంతకీ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎదో తేలలేదు కానీప్రజా ధనంతో జగన్ నిర్మించుకుంటున్న విశాఖ రుషికొండ పాలస్ ఖర్చెంతో ఎట్టకేలకు బయటకొచ్చింది.433 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నిర్మాణంకు సంబంధించిన దాదాపుగా 10 జీవోలను ఇంతవరకు రహస్యంగా ఉంచిన ప్రభుత్వం హైకోర్టు జోక్యం చేసుకోవడంతో ప్రభుత్వ వెబ్ సైట్ లో పొందుపరిచారు.

అంచనా వ్యయం కంటే 16 % బడ్జెట్ వ్యయం పెరిగినట్టు సమాచారం. ముందుగా టూరిజం డెవలప్మెంట్ అంటూ మొదలుపెట్టిన వైసీపీ ప్రభుత్వం అంచెలంచెలుగా కొండకు గుండు కొడుతూ ప్రజలకు సున్నం రాసింది. టూరిజం కోసమే నిర్మాణాలు అంటారు కానీ ఆ కొండ చుట్టూ నో ఎంట్రీ బోర్డులు తగిలిస్తారు. “వైసీపీ నేతల డిక్షనరీ లో టూరిజం అంటే నిషిద్ధ ప్రాంతమని అర్ధం” రాసుందేమో మరి.

సామాన్య ప్రజానీకం సంగతి పక్కన పెడితే ప్రతిపక్ష పార్టీ నేతలకు కూడా అక్కడికి ప్రవేశం నిషిద్ధమని పవన్ వారాహి యాత్రతో తేటతెల్లమైంది. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు ఏపీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అద్దె భవనంలో నివాసం ఉండి ఏపీ ప్రజలకు రాజధాని నిర్మించాలని ఆరాటపడితే కనీసం చంద్రబాబు ఏపీలో సొంత ఇంటిని సైతం నిర్మించుకోలేదని దాన్ని కూడా ఎద్దేవా చేసి తప్పుబట్టారు వైసీపీ గ్యాంగ్.

ప్రజలను నమ్మించడానికి, రాజధానిని కూల్చడానికే జగన్ తాడేపల్లి పాలస్ నిర్మించారనే విషయం వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాతనే ఏపీ ప్రజలకు అర్ధమయ్యింది. “చేతులు కాలకా ఆకులు పట్టుకుని ప్రయోజనం ఏముంది”? అన్నటుగా ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్ మాత్రం ప్రజల సొమ్ముతో సుమారు 500 కోట్లతో విలాసవంతంగా కొండను తవ్వి మరి విశాఖలో మరో పాలస్ నిర్మించుకున్నారు.

ఈ పాలసీలో ఫర్నిచర్ కే 14 కోట్లు ఖర్చు చేసినట్లు జీవోలో పొందుపరిచారు. 500 కోట్ల పాలస్ ఉన్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిజంగా పేదవాడేనేమో. రాష్ట్రంలో రహదాలు సరిగాలేక గడిచిన నాలుగేళ్లుగా అటు వాహనదారులు ఇటు విద్యాలయాలకు వెళ్లే విద్యార్థులు నరకయాతన అనుభవిస్తుంటే జగన్ మాత్రం 433 కోట్లతో అతిపేదవాడి ఇళ్ళు నిర్మించుకున్నారు. గడిచిన నాలుగున్నరేళ్లలో గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన రాజధాని అమరావతిలో కనీసం ఒక్క ఇటుక కూడా వేయడానికి మనసు రాని జగన్ కు ఇన్ని కోట్ల ప్రజా సొమ్ముతో ఇళ్ళు నిర్మించుకోవడానికి మాత్రం చేతులొచ్చాయి.

అంతేలే రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవుండదు అంటారు ఇందుకే కాబోలు. పాలించేవాడికి చెయ్యాలనే ఆసక్తి ఉంటే ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయి, గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతులు నిరాకరించింది, కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదు, రాష్ట్రంలో నిధుల కొరత ఏర్పడింది, రాష్ట్రానికి కరువొచ్చింది నాకు జ్వరమొచ్చింది అంటూ కుంటి సాకులు చెప్పాల్సిన అవసరం రాదు అనేది రుషికొండ పై వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాలను చూస్తే అర్ధమవుతుంది.