
పల్నాడు పర్యటనలో జగన్ కారు క్రింద పడి సింగయ్య అనే వైసీపీ కార్యకర్త చనిపోతే కనీసం పట్టించుకోలేదు. సాటి కార్యకర్తలు కూడా అతనిని నిర్ధాక్షిణ్యంగా రోడ్డు పక్కకి ఈడ్చేసి ‘జై జగన్’ అంటూ ముందుకు సాగిపోయారు. అప్పుడు స్థానికులు అంబులెన్స్ రప్పించి సింగయ్యని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.
ఈ ఘటన జరిగిన మర్నాడు జగన్ తాడేపల్లి ప్యాలస్‌లో మీడియాతో మాట్లాడుతూ, “నా కార్యకర్త నా కారు కిందే పడి చనిపోతే నాకు బాధ కలగదా?మా పార్టీ నేతలను అతని ఇంటికి పంపించి పది లక్షల ఆర్ధిక సాయం అందించాను,” అని జగన్ చెప్పారు.
Also Read – చీకట్లో వేసేసి పగలు పరామర్శించాలట!
సింగయ్య మృతిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని, జగన్ కారు కిందే సింగయ్య పడి చనిపోయాడని ఫోరెన్సిక్ నివేదికతో ధృవీకరించుకొని విచారణ జరుపుతున్నారు.
ఆ కేసులో పోలీసులు తనని అరెస్ట్ చేస్తారని ఊహించిన జగన్, హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా వేసి రెండు వారాలు గడువు పొందారు.
Also Read – పాపం రాజాసింగ్.. రాజీనామాతో రాజకీయ అనాధగా మారారు!
ఇవన్నీ సింగయ్య మృతికి జగన్ కారణమని ధృవీకరిస్తున్నాయి కదా?
కానీ సింగయ్య భార్య లూర్దు మేరీని జగన్ ప్యాలస్‌కు పిలిపించుకొని మాట్లాడిన తర్వాత, ఆమె మీడియాతో మాట్లాడుతూ, “నా భర్త సింగయ్య మృతిపై నాకు అనుమానాలున్నాయి. సింగయ్యని అంబులెన్సులో ఆస్పత్రికి తీసుకువెళుతున్నప్పుడు ఏదో చేసి ఉంటారని నాకు అనుమానంగా ఉంది,” అని చెప్పారు.
Also Read – బీసీ రిజర్వేషన్స్: బీఆర్ఎస్‌లో గందరగోళం
జగన్ కారు క్రింద పడి నలిగిపోవడం వల్లనే తన భర్త చనిపోయాడని ఆమెకు తెలిసి ఉన్నప్పటికీ, ఆమె చేతనే “అంబులెన్సులో ఏదో చేసి ఉండవచ్చని” చెప్పించడం జగన్ నీచ రాజకీయాలకు పరాకాష్ట అని చెప్పుకోవచ్చు.
నిజానికి సింగయ్య తన కారు కింద పడినప్పుడే జగన్ వెంటనే స్పందించి తన కాన్వాయ్‌లోని వాహనంలోనో లేదా వెంట వస్తున్న వాహనంలోనో ఆస్పత్రికి తరలించి ఉండాలి. అది కనీసం మానవత్వం. కానీ తీవ్రంగా గాయపడి ప్రాణపాయంతో ఉన్న సింగయ్యని నిర్ధాక్షిణ్యంగా పక్కకి ఈడ్పించేసి ముందుకు సాగిపోయారు.
అటువంటి వ్యక్తిని సింగయ్య భార్య నమ్ముకొని ఈవిదంగా ఆరోపణ చేయడం చాలా శోచనీయం. అసలు “అంబులెన్సులో సింగయ్యని ఏదో చేసి ఉండొచ్చు,” అనే ‘గొప్ప ఆలోచన’ ఆమెకు కలిగిందనుకోలేము.
ఆమె భర్త చావుకి కారణమైన జగన్, ఆమెను కూడా తన శవ రాజకీయాలలో పావుగా వాడుకోవడం చాలా నికృష్టమైన ఆలోచనే.. కాదా?