అధికారం కోసం జగన్‌… ప్రజల కోసం పవన్ తాపత్రయం

Jagan Pawan Kalyan

చిరంజీవి రాజకీయాలలోకి ఎందుకు వచ్చారని అడిగితే అందరూ సమాధానం చెప్పగలరు కానీ పవన్‌ కళ్యాణ్‌ ఎందుకు వచ్చారంటే కాస్త ఆలోచించుకొని చెప్పాల్సి వస్తుంది.

పవన్‌ కళ్యాణ్‌ కూడా తనకు ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఉందని, ఒకవేళ అయ్యే అవకాశం ఉంటే వదులుకోనని స్వయంగా చెప్పుకున్నారు. అయితే ఈ మాట రాజకీయాలలోకి వచ్చిన పదేళ్ళ తర్వాత అన్నారనే సంగతి మరిచిపోకూడదు.

ADVERTISEMENT

పవన్‌ కళ్యాణ్‌ పార్టీ పెట్టిన వెంటనే ఎన్నికలలో పోటీ చేసే అవకాశం ఉన్నప్పటికీ చేయలేదు. టిడిపి, బీజేపీలకు మద్దతు ఇచ్చి గెలిపించి తాను పక్కకు తప్పుకున్నారు. ఆ తర్వాత 2019లో తొలిసారిగా జనసేన పోటీ చేసింది. ఓడిపోయింది. ఆ కారణాల గురించి ఇప్పుడు చర్చ అప్రస్తుతం.

ఈ పదేళ్ళ రాజకీయ అనుభవంతో పవన్‌ కళ్యాణ్‌ ఈసారి టిడిపి, బీజేపీలతో కలిసి పోటీ చేసేందుకు సిద్దపడ్డారు కానీ పార్టీ బలాబలాల గురించి తెలిసున్న కారణంగా దురాశకు పోకుండా పొత్తులో భాగంగా జనసేనకు దక్కిన స్థానాలలోనే పోటీ చేస్తున్నారు.

జనసేన స్థాపించినప్పటి నుంచి నేటి వరకు సాగిన ఈ ప్రస్థానాన్ని నిశితంగా గమనిస్తే, పవన్‌ కళ్యాణ్‌ పదవులు, అధికారం, డబ్బు సంపాదన కోసం ఆరాటపడటం లేదని, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, ప్రజల కోసమే రాజకీయాలలో ఉన్నారని స్పష్టం అవుతుంది.

ఇందుకోసం పవన్‌ కళ్యాణ్‌ అనేక అవమానాలు, అవహేళనలు భరిస్తున్నారు. అనేక త్యాగాలు చేస్తున్నారు. అయినా పట్టుదలగా ముందుకే సాగుతున్నారు. ఓ మంచి రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఇదే.

జగన్‌లో కూడా ఇటువంటి పట్టుదలే ఉంది కనుక ముఖ్యమంత్రి కాగలిగారు. కానీ జగన్, పవన్‌ ఇద్దరిలో ప్రధానమైన తేడా ఏమిటంటే జగన్‌ ముఖ్యమంత్రి అవ్వాలనే ఏకైక లక్ష్యంతోనే వైసీపిని నడిపించి తన కల నెరవేర్చుకున్నారు.

కానీ రాష్ట్ర విభజనతో దెబ్బ తిన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మళ్ళీ గాడిన పడి ఇతర రాష్ట్రాలతో పోటీ పడే స్థాయికి చేరుకోవాలనే పవన్‌ కళ్యాణ్‌ కల ఇంకా నెరవేరవలసి ఉంది.

పదేళ్ళ రాజకీయ పాఠాలు నేర్పిన అనుభవంతో పవన్‌ కళ్యాణ్‌ చాలా పరిపక్వతతో మాట్లాడుతూ, నిర్ణయాలు తీసుకుంటుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడుని జగన్‌ ప్రభుత్వం అరెస్ట్ చేయగానే పవన్‌ కళ్యాణ్‌ మరో ఆలోచన చేయకుండా వెంటనే రాజమండ్రి చేరుకొని ఆయనకు సంఘీభావం తెలుపడం, వెంటనే టిడిపితో పొత్తు ప్రకటన చేయడంతో రాష్ట్ర ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్నారు. టిడిపి ఆ కషకాలంలో పవన్‌ కళ్యాణ్‌ కొండంత అండగా నిలబడ్డారు కూడా.

టిడిపి, జనసేనల పొత్తుని విచ్చిన్నం చేయడానికి జగన్‌ & కో చేసిన ప్రయత్నాలను పవన్‌ కళ్యాణ్‌ తిప్పి కొట్టడమే కాక బీజేపీతో టిడిపికి పొత్తు కుదర్చడంలో కూడా కీలకపాత్ర పోషించారు.

టిడిపి, బీజేపీలతో పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాట్లలో వెనక్కు తగ్గడం, అందుకు ఎన్ని విమర్శలు, అవహేళనలు ఎదురైనా నిబ్బరంగా మాటకు కట్టుబడి నిలబడి ఉండగలగడం పవన్‌ కళ్యాణ్‌ రాజకీయ పరిపక్వతకు నిదర్శనాలుగా భావించవచ్చు.

పవన్‌ కళ్యాణ్‌లో ఇంత పరిపక్వతతో వ్యవహరిస్తున్నారు కనుకనే ఇప్పుడు ఆయన తరపున, జనసేన అభ్యర్ధుల తరపున ఎన్నికల ప్రచారం చేసేందుకు అనేకమంది వస్తున్నారు. ఒకప్పుడు కాపు సామాజికవర్గంలో పెద్దలకు పవన్‌ కళ్యాణ్‌పై దురాభిప్రాయం కూడా మెల్లమెల్లగా తొలగిపోయి ఆయన సరైన దిశలోనే ప్రయాణిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కనుక ఈసారి ఎన్నికలలో టిడిపి, జనసేన, బీజేపీ కూటమి గెలుపులో పవన్‌ కళ్యాణ్‌ చాలా ప్రధాన పాత్ర పోషిస్తున్నారని చెప్పవచ్చు.

ADVERTISEMENT
Latest Stories