జగన్ భవిష్యత్తు షర్మిల చేతిలో?

జగన్ భవిష్యత్తు షర్మిల చేతిలో?ఒకప్పుడు జగన్ విసిరిన బాణంగా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్న షర్మిల, ఇపుడు అదే బాణం తిరిగి జగన్ కు గుచ్చుకోబోతోందా? అంటే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన వీకెండ్ ఆర్కే కధనం ప్రకారం అయితే, జగన్ రాజకీయ భవిష్యత్తు షర్మిల తీసుకోబోయే నిర్ణయాలపై ఆధారపడి ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు.

వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో షర్మిల సాక్ష్యం అత్యంత కీలకం కాబోతోందన్నది ఈ కధనంలో ఉన్న ప్రధాన సారాంశాలలో ఒకటి. వివేకానందరెడ్డి బ్రతికి ఉన్న సమయంలో కడప ఎంపీ స్థానంలో ఉంటే నేను లేక నీవు ఉండాలని షర్మిల దగ్గర చెప్పినట్లుగా తెలుసుకున్న సీబీఐ, షర్మిలను అడుగగా, అది వాస్తవమేనని షర్మిల మౌఖికంగా చెప్పినట్లుగా ఈ కధనంలో పేర్కొన్నారు.

ADVERTISEMENT

దీంతో వివేకా హత్యకు సంబంధించిన ‘మోటివ్’ సీబీఐకు లభించినట్లయ్యిందని, ఇదే స్టేట్మెంట్ రూపంలో కనుక షర్మిల ఇస్తే కడప ఎంపీ అవినాష్ రెడ్డి మరియు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి మెడకు ఉచ్చు బిగుసుకోవడం ఖాయంగా పేర్కొన్నారు. మౌఖికంగా పేర్కొన్న షర్మిల, అవసరమైతే తాను స్టేట్మెంట్ ఇవ్వడానికి సిద్ధమేనని సీబీఐకు తెలిపారట.

ఇటీవల ఆస్తుల పంపకాల విషయంలో జగన్ – షర్మిల మధ్య విభేదాలు తలెత్తడమే కాకుండా, తెలంగాణాలో షర్మిల పార్టీ ఎదగకుండా జగన్ రాజకీయంగా తీసుకువస్తున్న ఒత్తిడిలపై కూడా షర్మిల ఆగ్రహంగా ఉన్నారట. మాజీ టీఆర్ఎస్ ఎంపీ ఒకరు షర్మిల పార్టీలో చేరతానని హామీ ఇవ్వగా, ఆయనను షర్మిల దగ్గరకు వెళ్లకుండా జగన్ అడ్డుపడ్డారని, ఇలాగే మరికొందరిని కూడా చేసి షర్మిల ఎదుగుదలకు బ్రేకులు వేస్తున్నారట.

ఈ విషయాలతో కలత చెందిన షర్మిల, ఏపీలో జగన్ ను కూడా రాజకీయంగా దెబ్బకొట్టాలని చూస్తున్నారట. ఈ దిశగా ఆచితూచి అడుగులు వేస్తోన్న షర్మిలకు వైఎస్ వివేకా హత్యోదంతం ప్రధాన ఆయుధంగా మారిందట. ఈ హత్య కేసు ఉందంతంలో మరో ట్విస్ట్ ఏమిటంటే… హత్య జరిగిన రోజు అవినాష్ రెడ్డి చేసిన కాల్ జాబితాలో జగన్ సతీమణి భారతి పేరు కూడా ఉందట.

ADVERTISEMENT
Latest Stories