ఇంగ్లీష్ మీడియం విషయంలోప్రభుత్వానికి చుక్కెదురు తప్పదా?

ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో సానుకూల తీర్పు వచ్చే అవకాశం లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏపీ ప్రభుత్వ పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బోబ్డే విచారించారు. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది విశ్వనాథన్ వాదనలు వినిపించారు.

పేద విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియంను తీసుకొచ్చిందని, 96 శాతం తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియం కోరుకుంటున్నారని ఆయన కోర్టుకు తెలిపారు. అయితే దీనిపై న్యాయమూర్తి స్పందించిన తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. ఇతర దేశాల్లో ఆంగ్లంతోపాటు మాతృభాషలో బోధన కొనసాగుతుందని… గణాంకాల ఆధారంగా ఈ అంశంలో నిర్ణయం తీసుకోలేమన్నారు.

ADVERTISEMENT

అదే సమయంలో ప్రాథమిక విద్యా మాతృభాషలో ఉండడం చాలా ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. పునాది గట్టిగా ఉంటే ఏ భాషనైనా అలవోకగా నేర్చుకోవచ్చని వ్యాఖ్యానిస్తూ.. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేశారు. దీనిబట్టి ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశం లేదని న్యాయ నిపుణులు అంటున్నారు.

ప్రభుత్వ స్కూళ్ళలో రెండు మీడియంలలో బోధన చేసి, ఏది కావాలో నిర్ణయించుకునే ఆప్షన్ విద్యార్థులకు ఇస్తే ఈ సమస్య వచ్చేది కాదు. ఒకవేళ నిజంగా 94% తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియం నే కోరుకుంటే… రెండు మూడు ఏళ్ళ లో డిమాండ్ లేదనే కారణంగా ఈ తెలుగు మీడియం స్కూళ్లను ప్రభుత్వం మూసివెయ్యచ్చు. అయితే తెలుగు మీడియం ఒప్పుకుంటే తాము వెనకడుగు వేసినట్టే అని ప్రభుత్వం ఇగోకి పోతుంది. ఇప్పుడు మొత్తంగా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టే ప్రక్రియే లేటు అవుతుంది.

ADVERTISEMENT
Latest Stories