ys_jagan_mohan

వైసీపి ఓటమికి కర్త, కర్మ, క్రియ అన్ని జగన్మోహన్‌ రెడ్డే అని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆయన చెప్పింది అక్షరాల నిజమేనని వైసీపిలో నేతలకు కూడా తెలుసు. జగన్‌ కూడా అలాగే అనుకున్నారు. అందుకే మా నమ్మకం, భవిష్యత్‌ నువ్వేనని వారిచేతే చెప్పించుకున్నారు.

Also Read – జనసేన ‘చిరు’దరహాసం…!

తాను ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ నిరంకుశ చక్రవర్తిలా వ్యవహరించారు. కానీ తన తప్పుడు నిర్ణయాలను మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల చేత అమలు చేయిస్తూ వాటిలో అందరినీ భాగస్వాములుగా మార్చేశారు. కనుక జగన్‌ చేసిన తప్పులకు అందరూ మూల్యం చెల్లించక తప్పలేదు.

అయితే ఇదేమీ రాత్రికి చేసిన, జరిగిన తప్పులు కావు. ఈ 5 ఏళ్ళుగా చేస్తూనే ఉన్నందున వాటిని గమనిస్తున్న ప్రతిపక్షాలు ఎప్పటికప్పుడు నిలదీసి ప్రశ్నిస్తూనే ఉన్నాయి.

Also Read – జీఎస్టీ ఆదాయం తగ్గితే.. సిగ్గు పడాల్సింది బాబు కాదు.. జగనే!

జగన్‌ అప్పుడే మేల్కొని తన తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం చేయకపోగా వారిపై తన మంత్రులు, ఎమ్మెల్యేల చేత ఎదురుదాడులు చేయిస్తూ, అక్రమ కేసులు పెట్టి వేధిస్తూ మరిన్ని తప్పులు చేశారు.

వైసీపిలో ఎవరూ తమ అధినేతని హెచ్చరించి గాడిన పెట్టే సాహాసం చేయలేకపోయినా మీడియాలో వార్తలను చూసి తప్పులు సరిదిద్దుకొని తీరు మార్చుకోవచ్చు. లేదా సుమారు 50 మంది సలహాదారులను నియమించుకున్నారు కనుక వారి సలహాలు తీసుకొని ఉండవచ్చు. లేదా కోట్లాది రూపాయలు ఫీజు చెల్లించి సేవలు పొందుతున్న ఐప్యాక్ బృందాన్ని అడిగి లోపాలు సరిదిద్దుకోవచ్చు.

Also Read – ఈ ఐదేళ్ల వడ్డీ కాదు గత ఐదేళ్ల వడ్డీ సంగతేంటి.?

ఇవేవీ కుదరవనుకుంటే మహామేధావి, ఆప్తమిత్రుడు కేసీఆర్‌ని అడిగి తాను పయనిస్తున్న మార్గం సరైనదో కాదో అడిగి తెలుసుకోవచ్చు. కానీ వైసీపికి శల్యసారధ్యం చేస్తున్న సజ్జల రామకృష్ణా రెడ్డి, విజయసాయి రెడ్డిలాంటి వంటివారి సలహాలు స్వీకరిస్తూ భారీ మెజార్టీతో గెలిచిన వైసీపిని రెండోసారి చేజేతులా దారుణంగా ఓడించేసుకున్నారు.

కనుక వైసీపి ఓటమికి ఎవరో కారణమని జగన్‌ నిందించలేరు. ఒకవేళ నిందించాలనుకుంటే జగన్‌ తనను తాను నిందించుకోవాలి. తనకు తప్పుడు సలహాలు ఇచ్చిన సజ్జల వంటి వారిని నిందించాలి. కానీ ఇప్పుడు ఎవరిని ఎవరు నిందించుకున్నా పోయిన అధికారం మళ్ళీ చేతికి రాదు కానీ (చేసిన పాపాలకు) పర్యవసానాలు ఎదుర్కోవడానికి ‘సిద్దం’గా ఉన్నానని జగన్‌ స్వయంగా చెప్పారు. కనుక ఆయనతో పాటు వైసీపిలో ప్రతీ ఒక్కరూ కూడా ‘సిద్దం’గా ఉండటం మంచిది.