
రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు నలుగురు మిత్రులు రెండు జోడీల మధ్య ఉగిసలాడుతున్నాయి. ఒక జోడీ ఏపీ పునర్నిర్మాణానికి నడుం బిగిస్తే మరో జోడి ఏపీ వినాశనానికి ఊతమిచ్చింది. అయితే ఈ రెండు జోడిల రాజకీయం మధ్య ‘నా’…’మన’… అనే వ్యత్యాసం స్పష్టంగా కనపడుతుంది.
నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం, రెండు దశాబ్దాల రాజకీయ ప్రస్థానం ఉన్న బాబు, పవన్ లు గాడి తప్పిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు ‘నా’ అనే స్వార్దాన్ని వీడి ‘మన’ అనే బంధానికి కట్టుబడి ఏపీ పునర్నిర్మాణానికి కలిసి ప్రయాణం మొదలుపెట్టారు. అయితే ఇక్కడ మరో జోడిగా చెప్పుకునే కేసీఆర్, జగన్ ఇద్దరు ‘నా’ అనే స్వార్దానికి లొంగి ఏపీ భవిష్యత్తును సమాధి చేసారు.
Also Read – యావత్ దేశం దృష్టి విశాఖ పైనే…
తన కేసుల నుండి తప్పించుకోవడానికి అధికారమే పరమావధిగా భావించి పొరుగు రాష్ట్రమైన తెలంగాణ ప్రభుత్వంతో కలిసి టీడీపీ పార్టీని దెబ్బ కొట్టారు జగన్. ఇక్కడ జగన్ కు ‘నా’ పార్టీ అధికారంలోకి రావాలి, ‘నేను’ ముఖ్యమంత్రిని కావాలి, ‘నా’ కేసుల నుండి తప్పించుకోవాలి, నేనే శాశ్వతంగా అధికారంలో ఉండాలి అనే స్వార్థం తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టలేదు.
అలాగే తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా గెలుపొందిన కేసీఆర్ మరో ఐదేళ్లు తన హావ కొనసాగిస్తూ తెలంగాణలో ‘నా’ పార్టీ మాత్రమే రాజకీయం చేయాలి, నాయకులందరూ ‘నా’ పార్టీలోనే ఉండాలి, అధికారం ‘నా’ కుటుంబానికే చెందాలి, పదవులలో ‘నా’ వారసులే ఉండాలి అనే స్వార్థంతో టి. టీడీపీ ని దెబ్బకొట్టిన కేసీఆర్ ఏపీ అభివృద్ధికి అడ్డుకట్ట వేయడానికి ఏపీ టీడీపీ ని కూడా భూస్థాపితం చేయడానికి జగన్ తో చేతులు కలిపారు.
Also Read – కొమ్మినేనికి ప్రమోషన్ ఖాయమేనా.?
వీరిద్దరిది ఒకటే స్వార్థం ‘నా’ పార్టీ, ‘నా’ అధికారం..! అయితే ఇందుకు భిన్నంగా బాబు, పవన్ లు రాజకీయాలలో ‘మన’ అనే మంచి సంప్రదాయానికి తెర లేపారు. ‘మన’ రాష్ట్రం కోసం, ‘మన’ తెలుగు వారి కోసం, ‘మన’ ప్రజల కోసం…అంటూ తమ అనుభవాన్ని, తమ స్టార్ హోదాను పక్కన పెట్టి రాష్ట్రం కోసం కలిసి నడుస్తున్నారు. ఒకరిని ఒకరు గౌరవించుకుంటూనే ఒకరి కోసం ఒకరు తగ్గి నెగ్గారు.
ఏపీకి వైసీపీ అత్యంత ప్రమాదకరమైన వైరస్ గా భావించిన వీరిద్దరూ తనను తానూ తగ్గించుకుని, తన పార్టీని తగ్గించి, నాయకులను త్యాగాలకు సైతం ఒప్పించి “పసుపు…ఎరుపు” కలయికతో రాష్ట్రానికి పట్టిన “నీలి నీడ”ను తొలగించారు బాబు, పవన్ లు. మన అనే బంధంతో బాబు, పవన్ లు బలం లేని బీజేపీకి బలమయ్యారు, బలహీన పడ్డ రాష్ట్రానికి అండయ్యారు. ఇద్దరి వ్యక్తుల స్నేహం ‘నా’ అనే స్వార్థంతో రాష్ట్రాన్ని గాడి తప్పిస్తే, ఇద్దరి మిత్రుల ‘మన’ అనే బంధం రాష్ట్రాన్ని నిలబెట్టడానికి పునాదిగా మారింది.
Also Read – బనకచర్ల పేరుతో కాంగ్రెస్, బిఆర్ఎస్ యుద్ధాలు.. ఏపీకి తలనొప్పులు!