ఇక్కడ జగన్‌ అక్కడ కేటీఆర్‌ సేమ్‌ టూ సేమ్‌?

Revanth Reddy comparing Jagan and KCR political style and family disputes in Telangana speech

ఇక్కడ ఏపీలో జగన్‌, అక్కడ తెలంగాణలో కేసీఆర్‌ ఇద్దరూ ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే నియంతల్లా మారి ప్రతిపక్షాలను అణచివేసి ఎప్పటికీ తామే అధికారంలో కొనసాగాలనుకున్నారు. ఇక్కడ వైసీపీ అక్కడ బీఆర్ఎస్‌ పార్టీ ఒకేలాగ ఉవ్వెత్తున ఎగసిపడి ఇంచుమించు ఒకే సమయంలో కుప్పకూలిపోయాయి.

రాజకీయాలలో ఇటువంటి స్వారూప్యతలు సర్వసాధారణమే. కానీ వారి కుటుంబాలలో కూడా ఇంచుమించు ఒకే విధంగా అవాంచనీయ పరిణామాలు జరగడం ఆశ్చర్యకరమే.

ADVERTISEMENT

తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి మంగళవారం జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, కేసీఆర్‌ అధికారంలో ఉన్నప్పుడు అవినీతికి పాల్పడి వేలకోట్లు ఆస్తులు సంపాదించారు. అ ఆస్తులలో కల్వకుంట్ల కవితకి పది పైసలు వాటా ఇవ్వడానికి కూడా కేటీఆర్‌ ఇష్టపడలేదు.

ఆస్తిలో వాటా అడిగినందుకు ఆమెను మెడ పట్టుకొని పార్టీ నుంచి బయటకు గెంటేశారు. ఆమె ఇప్పుడు ఆదిలాబాద్‌లో తిరుగుతూ మా అన్న నన్ను మోసం చేసి బయటకు గెంటేశారని చెప్పుకొని బాధపడుతున్నారు. సొంత చెల్లినే గెంటేసిన దుర్మార్గుడు మాగంటి సునీతమ్మకి లేదా తెలంగాణలో ఆడబిడ్డలకి న్యాయం చేస్తానంటే నమ్మశక్యంగా ఉందా?

చెల్లికి గాజులు కొననివాడు పిన్నమ్మకి బంగారు గాజులు చేయిస్తానన్నాడట! అలాగే ఉన్నాయి కేటీఆర్‌ మాటలు,” అంటూ సిఎం రేవంత్ రెడ్డి కేటీఆర్‌పై నిప్పులు చెరిగారు.

కేటీఆర్‌-కవితల గురించి సిఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు విన్నప్పుడు, ఏపీ ప్రజలకు జగన్‌-షర్మిల గుర్తుకు రాకుండా ఉంటారా?

ADVERTISEMENT
Latest Stories