Jagan Mohan Reddy Warning to TDP

చంద్రబాబు నాయుడు పాలనలో వైసీపీ కార్యకర్తల మీద జరుగుతున్న దౌర్జన్యాలకు, దాడులకు తిరిగి సమాధానం చెప్పే రోజు తప్పక వస్తుందని, అప్పుడు అందుకు సంబంధించిన వారు సప్త సముద్రాల వెనుక దాగిఉన్నప్పటికీ వైసీపీ నుంచి తప్పించుకోలేరంటూ ప్రతిపక్షంలోకి వచ్చిన ఆరు నెలలలోపు వైస్ జగన్ కూటమి ప్రభుత్వాన్ని, ప్రభుత్వాన్ని నడిపించే వ్యవస్ఠాధిపతులను హెచ్చరిస్తున్నారు.

అయితే గత ఐదేళ్లు జగన్ చేసిందేమిటో ఈ తొమ్మిది నెలలలో బాబు చెయ్యలేనిదేమిటో ఒక్కసారి టీడీపీ, జనసేన కార్యకర్తలను అడిగితే తెలుస్తుంది. ఒక్క ఛాన్స్ అంటూ గద్దెనెక్కిన జగన్ ఆ ఒక్క ఛాన్స్ ఎందుకు వెచ్చించారో, ఎలా వాడుకున్నారో రాజధానికి భూములిచ్చిన అమరావతి రైతు కుటుంబాలను అడగాలి, అలాగే శుక్రవారం, శుక్రవారం జైళ్లలో ఆహాకారాలు చేసిన టీడీపీ, జనసేన కార్యకర్తలను అడగాలి.

Also Read – కోర్ట్: నాని జడ్జ్ మెంట్ బాగుంది..!

అలాగే బాబు నాయకత్వాన్ని బలపరచడానికి నడుం బిగించిన టీడీపీ నేతలు, జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లాలని ఉర్రుతలూగిన జనసైనికులు, వారి కుటుంబాలు ఇలా గత ఐదేళ్లు టీడీపీ జెండా పట్టుకున్న ప్రతి కార్యకర్త, జనసేన గుర్తు చెప్పిన ప్రతి జనసైనికుడు లాఠీ దెబ్బలను రుచి చేసినవాడే, లేక వైసీపీ నేతల దౌర్జన్యాలకు బలైనవాడే. మరి వారి ‘మానసిక క్షోభ’కు కూటమి బదులు చెప్పగలిగిందా.?

జగన్ మాదిరి సప్త సముద్రాలు కాదుసరి కదా కనీసం వారిని సొంత రాష్ట్రంలో కూడా అదుపు చేయలేకపోతోంది. రోజా, కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేర్ని నాని, అంబటి రాంబాబు, సజ్జల భార్గవ్ రెడ్డి, శ్రీ రెడ్డి, పోసాని, రామ్ గోపాల్ వర్మ…ఇలా ఎంతో మంది వైసీపీ నేతలు, ఆ పార్టీ మద్దతుదారులు గత ఐదేళ్లు మనిషి అనే పదాన్ని మరిచి మానవత్వం అనే విలువను వదిలేసి చేసిన అరాచకానికి పసుపు జెండా పట్టుకున్న ప్రతి కార్యకర్త గుండె రగిలింది, అలాగే జనసేన జెండా మోసిన ప్రతివాడి రక్తం మరిగింది.

Also Read – వైసీపీ ‘గొంతు’నొక్కేస్తే…కూటమి ‘కళ్ళు’ మూసుకుందా.?

రాజకీయాలకు సంబంధం లేని మహిళలను బజారుకీడ్చారు, బాబుని అరెస్టు చేసి, ఆయన చావు మీద రాజకీయ పరాచకాలు చేసారు, అలాగే జనసేన అధినేత పవన్ ను నిర్బంధించి, ఆయను మూడు పెళ్లిళ్ల మీద విమర్శలు గుప్పిస్తూ ఆయన వ్యక్తిగత జీవితాన్నిఅవహేళన చేసారు. దీనితో ఆయా పార్టీల కార్యకర్తల, నాయకుల, మద్దతుదారుల మనోభావాలు తీవ్రంగా గాయపడ్డాయి. మరి ఆ మనోవేధనకు ఇప్పుడు న్యాయం జరుగుతుందా.?

అజ్ఞాతంలోకి వెళితే వదిలేస్తారా.? క్షమాపణలు కోరితే కరుణిస్తారా.? మాట వెనక్కి తీసుకుంటే మన్నిస్తారా.? ఇదేనా పార్టీ కోసం కుటుంబాన్ని పక్కన పెట్టి ప్రాణాన్ని లెక్కచేయని సగటు కార్యకర్తకి దక్కిన గౌరవం.? అంటూ ఈ రెండు పార్టీల శ్రేణులు మౌన రోధన చేస్తున్నారు.

Also Read – పవన్ లక్ష్యం గురి తప్పిందా.? గురి తప్పిస్తున్నారా.?


పార్టీ ప్రతిపక్షంలో ఉంటే జెండా మోస్తూ పోరాటం చేసిన వాడికి పార్టీ అధికారంలోకి వస్తే ఇచ్చే విలువ ఇంతేనా.? అంటూ రగిలిపోతున్నారు. దీనితో వారి ఐదేళ్ల మనోభావాలను, మానసిక క్షోభను పార్టీ అధినేతలు గాలికొదిలేసినట్టేనా.? అనే సందేహం ఇరు ఆప్ర్తిలా శ్రేణులను కలవరపరుస్తోంది. ఇలా అయితే పార్టీ కోసం ప్రాణం పెట్టె వాడు, పార్టీ అధినేత కోసం ప్రాణం ఇచ్చేవాడు రేపటి రోజున ముందుకొస్తాడా.?