
తెలుగు రాష్ట్ర రాజకీయాలలో నాయకుల పాదయాత్రలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. వైస్ రాజశేఖర్ రెడ్డి తో మొదలైన ఈ పాదయాత్రల ఫాంటసీ చంద్రబాబు, జగన్, లోకేష్ ల వరకు కొనసాగింది.
2014 ఎన్నికల ముందు “వస్తున్నా మీ కోసం” అంటూ బాబు చేసిన పాదయాత్ర టీడీపీ కి పట్టం కట్టయింది. ఇక 2019 ఎన్నికల ముందు వైస్ జగన్ “ప్రజా సంకల్ప యాత్ర” పేరుతో వైసీపీ ని అధికారంలోకి తెచ్చారు.
Also Read – గుడివాడ ఫ్లెక్సీ వివాదం..
ఇక 2024 కి గాను నారా లోకేష్ “యువగళం” పేరుతో రాష్ట్ర వ్యాప్త పర్యటనను పూర్తి చేసి టీడీపీ తిరిగి జీవం పోశారు, కూటమి గెలుపుకి బాటలు వేశారు. ఇలా ఏపీ రాజకీయాలలో నాయకుల పాదయాత్రాలకు ఒక స్పెషల్ ఇంపాక్ట్ ఏర్పడింది. అటు ఏపీ ప్రజలకు కూడా ఈ నాయకుల పాదయాత్ర ఒక సెంటిమెంటుగా మారిపోయింది.
అయితే మొన్న వైస్ జగన్ తన పార్టీ యువజన విభాగం నాయకులతో జరిపిన సమీక్షా సమావేశాలలో తానూ వైసీపీ పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు మరోసారి పాదయాత్ర చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ ప్రకటించారు.
Also Read – ప్రకాష్ రాజ్ జస్ట్ ఆస్కింగ్ పవన్ కళ్యాణ్
నేను భవిష్యత్ లో చేయబోయే పాదయాత్రలో మీ అందరితోనూ వ్యక్తిగతంగా మాట్లాడతాను అంటూ హామీ ఇచ్చారు జగన్. అయితే జగన్ ప్రకటించినట్టుగా, వైసీపీ ఆశించినట్టుగా వైస్ జగన్ మరోసారి పాదయాత్ర చెయ్యగలరా.? ప్రజాక్షేత్రంలో జగన్ పై ఆనాటి నమ్మకం ఈనాటి కి కొనసాగుతుందా.?
గత ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్ ప్యాలస్ గేట్ దాటలేదు, పార్టీ నాయకులకే కాదు చివరికి ప్రజలకు కూడా ముఖం చాటేస్తూ ప్రభుత్వాన్ని నడిపిన జగన్ పూర్తిగా ప్రజలతో సంబంధాలను తెంచుకున్నారు. ఒకేవేళ ఏదైనా బటన్ నొక్కే కార్యక్రమానికి వెళ్లాల్సి వచ్చినా రోడ్లల్ని నిర్మానుష్యంగా మార్చేయడం,
Also Read – కోటా శ్రీనివాసరావు ఇక లేరు
పరదాలను చుట్టేయడం, చెట్లను నరికేయడం, దుకాణాలను మూయించడం ఇలా జగన్ ఒక్కో అడుగు ప్రజాక్షేత్రానికి దూరమవుతూ వచ్చాడు. అయితే నాటి చేదు జ్ఞాపకాలను ప్రజలు మరిచిపోగలరా.? జగన్ వాటిని మరిపించగలరా.? అలాగే ఈసారి జగన్ పాదయాత్ర లో రాజధాని అమరావతి అంశం అత్యంత కీలక పాత్ర పోషించనుంది.
2019 ఎన్నికలకు ముందు జగన్ చేసిన పాదయాత్రలో రాష్ట్ర రాజధాని అమరావతి మీద ప్రజలలో ఒక నమ్మకాన్ని కలిగించిన జగన్ ఆ తరువాత ఐదేళ్లు మూడు రాజధానుల పేరుతో ఆ నమ్మకాన్ని మోసంగా మార్చారు. దీనితో భవిష్యత్ లో జగన్ చేయబోయే పాదయాత్రలో వైసీపీకి రాజధాని అంశం ఒక వీడని చిక్కుముడే అవుతుంది.
అయితే జగన్ తన ముఖ్యమంత్రి పదవి కోసం, వైసీపీ పార్టీ అధికారం కోసం ఏదైనా చేస్తాడు, ఎందాకైనా వెళ్తాడు అనేది వాస్తవం. అలాగే గత ఐదేళ్ల వైసీపీ పాలన, ముఖ్యమంత్రిగా జగన్ పని తీరు ఈ వాస్తవాలకు కొన్ని అనుమానాలను జోడిస్తుంది.
జగన్ పాదయాత్ర కేవలం అధికారం కోసమేనా.? ఆయన వేసే అడుగులు ప్రజా సమస్యల పరిష్కారం కోసమా.? ప్రత్యర్థి పార్టీ నాయకుల మీద పగ తీర్చుకోవడం కోసమా.? వైసీపీ విధానం అమరావతి విధ్వంశమా.? పార్టీ కార్యకర్తల శ్రేయస్సు కోసమా.? జగన్ ఆలోచనలు, వైసీపీ రాజకీయ విధానాలు ఈ అనుమానాలను మరింతగా బలపరుస్తున్నాయి.
మరి ఈ నేపథ్యంలో రాబోయే కాలంలో వైస్ జగన్ చెయ్యబోయే పాదయాత్ర వైసీపీ కి ఏ మేరకు రాజకీయ లబ్ది చేకూరుస్తుందో.? జగన్ కు రాష్ట్రంలో ఏ పదవిని కట్టబెట్టనుందో.? రాజధాని అంశం ఏ మలుపు తిరగనుందో.? చూడాలి.