జగన్ పాదయాత్ర ప్రకటన వైసీపీ శ్రేణులకు ఎంతటి రాజకీయ బలాన్ని అందిస్తుందో అంతకంటే ఎక్కువ మానసిక స్తైర్యాన్ని కల్పిస్తుంది. జగన్ మరో ఏడాది తరువాత తన పాదయాత్ర మొదలుపెడతా, వైసీపీ ని తిరిగి అధికారంలోకి తెస్తా అంటూ చేసే ప్రకటనలు ఆ పార్టీ నాయకులతో పాటుగా మద్దతుదారులలో కూడా మంచి జోష్ ని నింపుతాయి.
అయితే జగన్ పాదయాత్ర ప్రకటన్లతో వచ్చే బలం ఆ పార్టీ శ్రేణులకు జగన్ తన ప్రెస్ మీట్లతో ఆవిరి చేస్తున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. జగన్ మీడియా ముందుకొచ్చారు అంటే చాలు ఏదొక అంశం మీద సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వడం సర్వ సాధారణం అయిపోయిందంటే అతిశయోక్తి కాదేమో.
మీడియా ముందు ఆయన చేసే ప్రకటనలు, ప్రత్యర్థుల పై చేసే విమర్శలు, తన పార్టీ నేతలకు మద్దతు పలికే సందర్భాలు…ఇలా అంశం ఏదైనా కానీ జగన్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వాల్సిందే. మొన్న మావిగన్ కానీ నిన్న సిదిరి అప్పలరాజు తనయుడి హిట్ అండ్ రన్ కేసు కానీ నేడు డీఎస్సి పరీక్ష వివాదం కానీ జగన్ చేసే వ్యాఖ్యలు అందుకు ఆయన చూపే హావభావాలు వైసీపీ శ్రేణులు కూడా మనస్పూర్తి గా సమర్ధించలేని పరిస్థితి.
నేడు డీఎస్సీ లో అక్రమాలు అంటూ మీడియా ముందుకొచ్చిన జగన్ వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన డీఎస్సీ, కూటమి ప్రభుత్వ హయాంలో జరిగిన డీఎస్సీ అంటూ మొదలుపెట్టి చివరికి DSC ని APPSC ని ఒక్కటి చేసేసారు. దీనితో ఇక జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు తక్షణమే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఒక పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కి డీఎస్సీ కి APPSC కి మధ్య వ్యత్యాసం తెలియదా అంటూ మంత్రి నారా లోకేష్ నుంచి మొదలుపెట్టి సోషల్ మీడియా యూజర్ల వరకు అందరు జగన్ పై విమర్శల అష్టోత్తరం ఎత్తుకుంటున్నారు. అయితే జగన్ మాటల తడబాటు ఇదే మొదటిసారి కాదు, మీడియా ముందుకొచ్చిన ప్రతిసారి ఇటువంటి ఆణిముత్యాలు ఎన్నో ఆ పార్టీ శ్రేణులకు వినిపిస్తుంటారు.
అయితే ఆ ఆణిముత్యాలను వెతికి పట్టుకోవడానికి సోషల్ మీడియా తో పాటుగా ప్రత్యర్థి పార్టీల నేతలు వారి మద్దతుదారులు కూడా ఎప్పుడు సిద్దంగానే ఉంటారు కాబట్టి జగన్ తన పాదయాత్ర ప్రకటన్లతో పార్టీ శ్రేణులకు కల్పించే భరోసా పై ఇటువంటి ప్రెస్ మీట్లతో ఆయనే చేచేతుల నీళ్లు చల్లుతున్నారు అంటూ జగన్ పై కౌంటర్లు వేస్తున్నారు.
Doesn’t know what APPSC means.
Doesn’t know what DSC means.
Thinks they’re both the same. ♂️With this level of understanding of Andhra Pradesh’s examination system, now we know why @ysjagan couldn’t conduct a single DSC in his tenure, and is now running away from a debate in… pic.twitter.com/SrqeB1qYgr
— Lokesh Nara (@naralokesh) August 20, 2026




