YSR-YS-Jagan-YS-Sharmila

జగన్, షర్మిల ఆస్తుల వివాదం బయటకు పొక్కినప్పుడు, ఆమె ఒంటరి పోరాటం చేస్తుండగా, జగన్‌ బెంగళూరు, తాడేపల్లి ప్యాలస్‌లలో కూర్చునే తన వైసీపి కౌరవసేనలతో ఆమెపై ఎదురుదాడి చేయించేవారు. చివరికి విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి వంటివారు కూడా ప్రెస్‌మీట్లు పెట్టి వైఎస్ షర్మిలపై తీవ్ర ఆరోపణలు చేశారు.

ఆమె ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు అయినప్పటికీ ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఒక్కరూ కూడా ముందుకు వచ్చి ఆమెకు అండగా నిలబడలేదు. మాట్లాడలేదు. కనుక అప్పుడు జగన్‌ పైచేయి సాధించిన్నట్లు ఉండేది.

Also Read – పుష్ప పై క్రెజే కాదు రూమర్లు తగ్గట్లా..!

కానీ క్రమంగా వారిద్దరి మద్య యుద్ధం తీవ్రతరమైన తర్వాత షర్మిల తన అన్నపై విజయమ్మ లేఖతో బ్రహ్మాస్త్రం సందించి నోరు ఎట్టలేని పరిస్థితి కల్పించారు.

ఇదెలా ఉందంటే, కురుక్షేత్ర సంగ్రామంలో ఆయుధం పట్టని శ్రీకృష్ణుడు పాండవుల వైపు, శ్రీకృష్ణుడి లక్షల మంది సైన్యం కౌరవులు (దుర్యోధనుడి) వైపు నిలిచిపోరాడుతున్నట్లు అయ్యింది.

Also Read – భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తుందేవరు..?

తల్లి విజయమ్మ ఎన్నటికీ తనకు వ్యతిరేకంగా వ్యవహరించరనే గుడ్డి నమ్మకంతోనే జగన్‌ ఇన్ని అబద్దాలు చెప్పి ఉండవచ్చు. కానీ ఆమె అనూహ్యంగా జగన్‌ చెల్లిని మోసం చేసిన మోసగాడంటూ లిఖిత పూర్వకంగా ప్రకటించేశారు. దీంతో ఇప్పుడు జగన్‌-షర్మిల బలాబలాలు ఒక్కసారిగా మారిపోయాయని చెప్పవచ్చు.

ఇంతవరకు జగన్‌ కోసం షర్మిలపై ఎదురుదాడి చేస్తున్న వైసీపి నేతలు కూడా ఇప్పుడు జగన్‌ని వెనకేసుకు వస్తూ విజయమ్మని ఎదిరించేందుకు ముందుకు రావడం లేదు. ఇటీవల జగన్‌ విజయనగరం జిల్లా గుర్లలో పర్యటించినప్పుడు జిల్లాలో సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మొహం చాటేశారు. అలాగే మరికొందరు సీనియర్స్ మొహం చాటేశారు.

Also Read – అన్న అలా…చెల్లి ఇలా..!

బొత్స సత్యనారాయణ విదేశీ పర్యటన పెట్టుకుని తప్పించుకోగా, మిగిలినవారు పట్టణంలోనే ఉన్నా జగన్‌ని పలకరించేందుకు రాలేదు.

జగన్‌ తీరు పట్ల ఒక్క విజయనగరం జిల్లాలో మాత్రమే కాదు యావత్ రాష్ట్రంలో వైసీపి నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

అందువల్లే ఇదివరకులా ఎవరూ ప్రెస్‌మీట్లు పెట్టి ఖండించడానికి ముందుకు రాలేదని చెప్పవచ్చు. ఒకవేళ ఈ కారణంగా వైసీపి నుంచి వలసలు కూడా మొదలైతే, ఈ ఆస్తుల యుద్ధంలో జగన్‌ ఒంటరిగా మిగిలిపోవచ్చు.