మోడీకి చెప్పగలరా ” కృష్ణా..రామ” ప్రవచనాలు.?

Jagan Mohan Reddy criticises Modi and Chandrababu Naidu over age

రాజకీయాలకు వయసు ఒక అడ్డంకి కాదు అని భారత రాజకీయ చరిత్రలో ఎందరో మహా నాయకులు నిరూపించి చూపించారు, ఇప్పటికి కొంతమంది నాయకులు నిరూపిస్తూ పాలన చేస్తున్నారు, ప్రభుత్వాన్ని నడుపుతున్నారు.

వారిలో ప్రముఖంగా చెప్పుకోదగ్గ నాయకులలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఒకరైతే దేశ ప్రధాని నరేంద్ర మోడీ మరొకరు. వీరిద్దరూ వయసు రీత్యా సుమారు ఒకే పిరియడ్ లో ఉన్నారు.

ADVERTISEMENT

CBN 75 సంవత్సరాలతో ఏపీ ముఖ్యమంత్రిగా కొనసాగుతుంటే, 74 ఏళ్ళతో మోడీ దేశ ప్రధానిగా చక్రం తిప్పుతున్నారు. CBN ముఖ్యమంత్రిగా నాల్గవసారి ప్రమాణ స్వీకారం చేయగా, మోడీ హ్యాట్రిక్ ప్రధానిగా రికార్డు సాధించారు.

అయితే నిన్న జరిగిన పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికల ఫ్రస్టేషన్ వైస్ జగన్ ని ఇంకాస్త దిగజార్చాయి. పులివెందుల ఫలితాలు ఇంకా బయటకు రానప్పటికీ వైసీపీ ఓటమి, వైఎస్ కుటుంబ పరాభవం వైస్ జగన్ మోహన్ రెడ్డి కళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది, ఆయన గొంతులో గట్టిగా వినిపిస్తుంది.

మొన్నటిదాకా వైసీపీ సార్వత్రికల ఘోర ఓటమికి ఈవీఎంలను నిందించిన జగన్ ఇక ఇప్పుడు పులివెందుల ఫలితాలకు బ్యాలట్ రిగ్గింగ్ అంశాన్ని తెరమీదకు తెస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఉద్దేశిస్తూ, బహుశా బాబు నీ జీవితానికి ఇవే చివరి ఎన్నికలు కావచ్చు,

ఈ వయస్సులో రామ..కృష్ణా అనుకుంటే కనీసం పుణ్యం అయినా వస్తుంది, ఈ మాదిరిగా చేస్తే చివరికి నరకానికి పోతావ్ అంటూ నీచమైన, హేయమైన వ్యాఖ్యలు చేసారు. గత ఐదేళ్లు వైసీపీ ఇదే మాదిరి CBN పై అసహ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ తన ఓటమికి తానే పునాదులేసుకుంది.

ఆ పునాదులే 151 తో ఉన్న వైసీపీ ని 11 గా మార్చి పాతాళానికి తెచ్చింది. అయినా వైస్ జగన్ కు తత్త్వం బోధపడలేదు. ఇప్పటికి అదే తీరుతో ఒకరి వయస్సు ను అడ్డం పెట్టుకుని ఆయన రాజకీయ జీవితాన్ని శాసించాలని చూస్తున్నారు.

2024 ఎన్నికల ప్రచారంలో కూడా బాబు ని ముసలోడు అంటూ హేళన చేసిన వైసీపీ నాయకులు ఇప్పుడు ఆ ముసలోడిని చూసే హాస్పిటల్ బెడ్ ఎక్కి, ఆపరేషన్ అంటూ రాష్ట్రం దాటి పారిపోయారు.

అయితే దాదాపు ప్రధాని నరేంద్ర మోడీ డి కూడా ఇదే వయసు. మరి కూటమి ప్రభుత్వంలో భాగమైన బీజేపీ నాయకుడు, దేశ ప్రధాని నరేంద్ర మోడీ కి కూడా జగన్ ఇదే మాదిరి మీ వయస్సుకి “రామ – కృష్ణా” అనుకోకుండా రాజకీయాలెందుకు.? ఎన్నికలలో పోటీలెందుకు.? అంటూ ప్రశ్నించగలరా.? నరకానికి పోతావ్ అంటూ దూషించగలరా.?

ఇవే మీ చివరి ఎన్నికలు అంటూ శాసించగలరా.? జగన్ కు కానీ వైసీపీ కి కానీ కేంద్ర బీజేపీ నాయకుల వైపు చూసే దమ్ము, ధైర్యం ఉంటుందా.? కేంద్రంలో అదికారంలో బీజేపీ పై గళం వినిపించాల్సిన వైసీపీ కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పై స్వరం పెంచుతుంది.వై.? బీజేపీ అంటే వైసీపీ కి భయమా.? జగన్ దడా.?

ఒకవేళ అన్ని బాగుండి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవించి ఉంటే మీ వయసుకి పదవులెందుకు.? ఇంట్లో కూర్చొని దేవుని ప్రవచనాలు వినండి, పుణ్యమస్తుంది అంటూ వైఎస్ఆర్ ను రాజకీయాల నుండి జగన్ వాలంటరీ రిటైర్మెంట్ ఇప్పించేవారా.? అందుకు వైఎస్ఆర్ అంగీకరించేవారా.?

రాజకీయాలలో ప్రత్యర్థిని ఎదుర్కోవాలంటే ఈ మాదిరి ఒకరి కీడును కాంక్షించకూడదు, ఒకరి అస్తిత్వాన్ని చెరిపేయాలని ఆశ పడకూడదు, ఒక పార్టీని రాజకీయాల నుండి శాశ్వతంగా తుడిచిపెట్టెయ్యాలని ఆవేశపడకుడదు.

అటువంటి చర్యలను సమాజం ఎప్పటికి హర్షించదు, అటువంటి వారి నాయకత్వాన్ని ప్రజలు ఎన్నడూ ఆమోదించారు. ఈ విషయం వైసీపీ కి ఇప్పటికి అర్ధం కాకపోవడం వారి మూర్కత్వనికి నిదర్శనం.

ADVERTISEMENT
Latest Stories