4 కోట్లు తీసుకుని అన్యాయం అంటోన్న జగపతిబాబు!

Jagapathi Reveals The Secret Behind S.I.R.హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో లోధా అపార్ట్ మెంట్స్ బిల్డర్ తమను మోసం చేశాడని ‘మ్యాన్లీ స్టార్’ జగపతి బాబు మండిపడ్డారు. లోధా గేటెడ్ కమ్యూనిటీ, హై ఎండ్ అపార్ట్ మెంట్స్ పేరుతో తమ నుంచి 4 కోట్ల రూపాయల చొప్పున వసూలు చేశారని, ఇప్పుడు పక్కనే ఉన్న అపార్ట్మెంట్లను కలపుతామని బిల్డర్ చెబుతున్నాడని, అదెలా సాధ్యమని… అలా బిల్డర్ తనకి నచ్చినట్టు చేయడానికా? తాము అంత పెద్ద మొత్తంలో మేము డబ్బులిచ్చింది? అంటూ జగపతి ప్రశ్నించారు.

సుమారు 7,000 మంది అక్కడ ఉంటున్నారని, వారంతా బిల్డర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని, అపార్ట్మెంట్లను గేటెడ్ కమ్యూనిటీలో కలిపితే రక్షణ ఉంటుందా? అని అడిగారు. ప్రశాంతత కోసమే ఎవరైనా గేటెడ్ కమ్యూనిటీని కోరుకుంటారని, అలాంటిది లోధా అపార్ట్ మెంట్స్ లో ఉంటుందా? అని అంతా ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఈ నిర్ణయాన్ని బిల్డర్ విరమించుకోవాలని, కాదు, కూడదని మొడికేస్తే ఏం చేయాలో, ఎలా చేయాలో కూడా తమకు తెలుసని హెచ్చరించారు జగపతిబాబు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories