‘స్పైడర్’ హంగామా… 100 కోట్ల పోస్టర్ పడింది..!

Jai Lava Kusa 100 Crores collectionsపోటీ వాతావరణంలో సినిమాను నిలబెట్టాలంటే ప్రమోషన్ చాలా ముఖ్యం. ఈ విషయంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ పక్కా ప్రణాళికతో ఉన్నట్లుగా తెలుస్తోంది. గత గురువారం విడుదలైన “జై లవకుశ” సినిమా హంగామా “స్పైడర్” విడుదలతో తగ్గనుంది. అయితే ఈ తరుణంలో కూడా ‘యంగ్ టైగర్’ ఫ్యాన్స్ ను ఉత్సాహపరిచేందుకు, మళ్ళీ రిపీట్ ఆడియన్స్ ను ధియేటర్లకు రప్పించేందుకు తాజాగా ఓ పోస్టర్ ను విడుదల చేసింది.

ADVERTISEMENT

100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను “జై లవకుశ” దాటినట్లుగా జూనియర్ ఎన్టీఆర్ షర్టు మడత పెడుతోన్న స్టిల్ ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహం నింపుతోంది. సరిగ్గా ‘స్పైడర్’ విడుదల రోజునే ఈ పోస్టర్ ను రిలీజ్ చేయడం వెనుక ఉద్దేశం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డివైడ్ టాక్ ఉన్నప్పటికీ, ‘జై లవకుశ’ సినిమాకు బంపర్ ఓపెనింగ్స్ దక్కాయని, అందుకు నిదర్శనమే ఈ 100 కోట్లు అన్న సంకేతాలు సినీ ప్రేక్షకుల్లోకి పంపేందుకు ఈ పోస్టర్ ను రిలీజ్ చేసారు.

దీనికి తోడు ‘స్పైడర్’ సినిమాకు మిక్స్ డ్ టాక్ లభించడంతో… మళ్ళీ ‘జై లవకుశ’కు కలెక్షన్ల వర్షం కురుస్తుందా? లేక పోను పోనూ “స్పైడర్” టాక్ మారుతుందా? అనేది వేచిచూడాలి. ఏది ఏమైనా “జై లవకుశ” సినిమా సూపర్ సక్సెస్ సాధించిందన్న సంకేతాలను జూనియర్ ఎన్టీఆర్ సోదరుడిగానే కాకుండా, ఓ సినీ నిర్మాతగా కళ్యాణ్ రామ్ పూర్తి ప్రణాళికలను సిద్ధం చేసుకున్నట్లుగా కనపడుతోంది. అయితే ఎప్పటిలాగానే ఈ కలెక్షన్స్ పై కూడా భిన్న స్పందనలు ఉన్నాయనుకోండి!

ADVERTISEMENT
Latest Stories