బాలయ్యా… నువ్వు బాక్స్ నుండి బయటకు రావాలయ్యా..!

Jai Simha Teaser‘సింహా’ అని పేరు వచ్చేలా టైటిల్… ఓ పది పవర్ ఫుల్ డైలాగ్ లు… ఓ నాలుగు ఫైట్లు… ఇదే బాలయ్య గత కొన్ని సంవత్సరాలుగా ఫాలో అవుతున్న సూత్రం. నిజానికి ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు వదిలేసి ఒక దశాబ్దం పైనే గడిచింది. కానీ మధ్యలో బోయపాటి బాలయ్యను చూపించిన విధానంతో ‘సింహా, లెజెండ్’ వంటి సినిమాలను హిట్ చేసారు. దీంతో మళ్ళీ అదే మూస ఫార్ములాను బాలయ్య తన అన్ని సినిమాలకు వర్తింపచేసుకుంటున్నారు.

వచ్చే సంక్రాంతికి విడుదల కాబోతున్న “జై సింహా” కూడా ఇదే రొటీన్ కొట్టుడన్న విషయం టీజర్ స్పష్టం చేసింది. సమయం… సందర్భం… సినిమాలో ఉందో లేదో తెలియదు గానీ, వినడానికి, చూడడానికి “జై సింహా”లో వాడిన డైలాగ్ కర్ణకఠోరంగా ఉందని చెప్పవచ్చు. “సింహం మౌనాన్ని సన్యాసం అనుకోవద్దు, సైలెంట్ గా ఉందని గెలికితే తల కొరికేస్తది” అని చెప్పే బాలయ్య డైలాగ్ గానీ, రూపురేఖలు గానీ ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకునేలా లేవు.

ADVERTISEMENT

టీజర్ చివర్లో కత్తి విసిరేసిన బాలయ్య గెటప్ ఒక్కటే కాస్త చూడదగినదిగా ఉంది తప్ప, ఈ టీజర్ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. బహుశా ట్రైలర్ విడుదలైతే “జై సింహా”పై ఫుల్ క్లారిటీ వస్తుందేమో గానీ, ప్రస్తుతం అయితే టీజర్ ను చూసి పెదవి విరిచే పరిస్థితే నెలకొంది. ఈ రొటీన్ “సింహా” బాక్స్ నుండి బయటకు రాకపోతే ఇక బాలయ్య సినిమాలను వీక్షించడం మరింత భారమవుతుందనే కామెంట్స్ సోషల్ మీడియాలో సర్వ సాధారణంగా వచ్చేవే.

ADVERTISEMENT
Latest Stories