పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఆవేశం కట్టలు తెంచుకుంటోంది !

Pawan Kalyan, Pawan Kalyan Indira Maidan, Pawan Kalyan Indira Maidan Meeting, Pawan Kalyan Jana Sena Indira Maidan Meeting, Pawan Kalyan Fans Indira Maidan Meetingపవన్ కళ్యాణ్ అంటే మామూలు ప్రజల దృష్టిలో ఓ హీరో, అప్ కమింగ్ రాజకీయనేత అంతే. కానీ అభిమానుల దృష్టిలో ఆయనో శిఖరం. దేవుడితో సమానం. ఆయన నటనను కాక వ్యక్తిత్వానికి అభిమానులైన వీరంతా పవన్ కళ్యాణ్ ఎప్పటికైనా రాజకీయ ప్రక్షాళన చేస్తాడనే నమ్మకంతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆ తరుణం రానే వచ్చింది.

ADVERTISEMENT

అభిమాని వినోద్ రాయల్ హత్య నైపథ్యంలో అతని కుటుంబాన్ని పరామర్శిచడానికి పవన్ గురువారం తిరుపతి చేరుకున్నాడు. అప్పటి నుండి ఆయన అక్కడే మకాం వేసి రెండు రోజులుగా తిరుపతి రాజకీయ పరిస్థితులను పరిశీలించి కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుని ఈరోజు సాయంత్రం అక్కడే భారీ బహిరంగ సభని ఏర్పాటు చేశారు.

ఎప్పుడూ ఫైర్ మీదుండే పవన్ అభిమానాలు తమ తోటి అభిమాని వినోద్ హత్య కావడం, పవన్ కూడా ఆ విషయంలో మనస్తాపం చెందడం వంటి కారణాలతో మంచి కాక మీదున్నారు. పైగా ఈరోజు సాయంత్రం పవన్ తన రాజకీయ భవితవ్యం గురించి పూర్తి స్థాయిలో వివరం ఇవ్వనుండటంతో ఆయన ఏం చెబుతారు ? ఎలా చెయ్యమంటారు ? అనే ప్రశ్నలతో అభిమానవుల్లో కార్య నిర్వహణావేశం ఎక్కువైపోతోంది. పోలీసులు కూడ ఇదే విషయాన్ని గమనించి బహిరంగ సభ వద్ద భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు.

ADVERTISEMENT
Latest Stories